BigTV English

PM Race: కేసీఆర్‌కు పోటీగా నితీష్.. పీఎం సీటు కోసం పావులు..

PM Race: కేసీఆర్‌కు పోటీగా నితీష్.. పీఎం సీటు కోసం పావులు..
kcr nitish

Latest political news in India(Telugu news updates): ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా బీహార్ CM నితీష్ కుమార్ ప్రయత్నాలు వేగవంతం చేశారు. PM పీఠం నుంచి మోదీని కదిలించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వరుసగా విపక్ష నేతలను కలుస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తున్నారు. గురువారం ముంబై వెళ్లి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో కలిసి పొత్తులపై కీలక చర్చలు జరిపారు.


ఇటీవలే భువనేశ్వర్ వెళ్లి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అంతకుముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను కూడా కలిశారు. గత నెలలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తోనూ భేటీ అయ్యారు. లేటెస్ట్‌గా ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు.

నితీష్ జోరు చూస్తుంటే.. ప్రధాని పీఠం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. సీఎం కేసీఆర్ తిరిగినట్టే.. దేశమంతా తిరుగుతున్నారు. పలువురు సీఎంలు, విపక్ష నేతలను కలిసి.. ప్రత్యామ్నాయ కూటమిపై చర్చిస్తున్నారు. కేసీఆరూ అదే పని.. నితీషూ అదే టాస్క్. అటు, మమత సైతం తాను ప్రధాని రేసులో ఉన్నానని పలుమార్లు చెప్పారు. కేజ్రీవాల్‌ అయితే తానే భావిభారత ప్రధానమంత్రినని భావిస్తున్నారు. అంతా పీఎం కేండిడేట్లే అయితే.. మరి వారికి మద్దతిచ్చేది ఎవరు?


మరి, అందరితో వరుసగా భేటీ అవుతున్న సీఎం నితీష్.. సీఎం కేసీఆర్‌తో మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారు? గతంలో గులాబీ బాస్ బీహార్ వెళ్లి మరీ నితీష్ ను కలిసి చర్చలు జరిపొచ్చారు. కేసీఆర్.. నితీష్ తో టచ్ లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారా? ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు నితీష్ కుమార్ రాకపోవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తనను పిలవలేదని.. పిలిచినా తాను రాకపోయేవాడినంటూ.. ఆ తర్వాత నితీష్ ఇచ్చిన స్టేట్ మెంట్ సైతం అంతే హాట్ టాపిక్ గా మారింది. బహుషా, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ దుకాణం పెట్టుకుని పీఎం సీటు కోసం సొంతంగా పాకులాడుతున్నారని కాబోలు.. గులాబీ బాస్‌ను వదిలేసి.. మిగతా పార్టీల బాస్‌లతో వరుస భేటీలు జరుపుతున్నారు నితీష్ కుమార్.

కేసీఆర్ అయితే తెలంగాణ మోడల్ అంటూ నేషనల్ పాలిటిక్స్‌లోకి దిగారు. మరి, నితీష్ ఎజెండా ఏంటి? బీహార్ మోడల్ అని చెప్పుకోగలరా? చర్చలైతే జరుగుతున్నాయి కానీ.. కూటమి ఏర్పాటు అంత ఈజీనా? కాంగ్రెస్‌ లేకుండా మనుగడ సాధ్యమేనా? బాహుబలి మోదీని పడగొట్టడం వీరి వల్ల అయ్యేనా?

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×