
President: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. తెలుసుగా. సీఎం కేసీఆర్ , గవర్నర్ తమిళిసై మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని. వాళ్లిద్దరూ ఎదురుపడక చాలాకాలమే అవుతోంది. ఏకంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నడిపించేస్తున్నారు కేసీఆర్. తమిళిసై జిల్లా పర్యటనల్లో ప్రోటోకాల్ అస్సలు పాటించడం లేదు సర్కారు. బిల్లులు పెండింగ్ లో పెడుతూ.. పలు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. తానేమీ తక్కువ కాదనే మెసేజ్ ఇస్తున్నారు గవర్నర్. ఇలా, ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండటంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదం నడుస్తోంది.
అలాంటిది, తాజా రాష్ట్రపతి పర్యటన వారిద్దరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. 5 రోజుల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించారు. ఇలా రాష్ట్రపతి పర్యటన.. చాలాకాలం తర్వాత గవర్నర్, సీఎంలను ఒకే ఫ్రేమ్ లోకి చేర్చింది. ఇది జస్ట్ ప్రోటోకాల్ కోసమే వారిద్దరూ ఒక్కచోటకు చేరారు కానీ.. ఆ తర్వాత మళ్లీ ఎవరి దారి వారిదే.. అని అంటున్నారు.
శీతాకాల విడిది కోసం తెలంగాణకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 5 రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 27న ఉదయం 10 గంటలకు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను ద్రౌపదీ ముర్ము సందర్శిస్తారు. అక్కడ అధ్యాపకులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కంచన్‌బాగ్‌లోని మిధానికి వెళ్లి వైడ్ ప్లేట్ మిల్లును ప్రారంభిస్తారు.
Revanth Reddy: లక్షల కోట్ల కుంభకోణం.. అంతా ఆ నలుగురి కోసం!.. రేవంత్‌రెడ్డి 111 ఆటంబాంబ్..