Big Stories

KCR : నెల రోజుల్లో 12 సార్లు సచివాలయానికి కేసీఆర్.. ప్రతిపక్షాలకు నో ఎంట్రీ..

CM KCR latest updates(Telangana today news) : తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో కొత్త సచివాలయాన్ని ప్రారంభించి నెల రోజులు గడుస్తోంది. ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. చెప్పినట్లుగానే అప్పటి నుంచి సచివాలయం కేంద్రంగా పాలన కొనసాగిస్తున్నారు. మంత్రులు కూడా రోజూ తమతమ పేషీల్లో సమయాన్ని గడుపుతూ కీలక ఫైల్స్ ను క్లియర్ చేస్తున్నారు.

- Advertisement -

కేసీఆర్ సచివాలయానికి రారనే విమర్శ గతంలో ఉండేది. పాత సచిలయానికి వచ్చేవారు కాదు. కేవలం ప్రగతి భవన్, ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లోనే ఉంటారని ప్రతిపక్ష నాయకులు విమర్శించేవారు. కానీ కొత్త సచివాలయం ప్రారంభమైన తర్వాత తరచుగా కేసీఆర్ విజిట్ చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు.

- Advertisement -

మే 18 న నూతన సచివాలయంలో మొదటిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. దాదాపు 4 గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఈ నెల మే 25న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ ఆవరణలోనే అందరితో కలిసి సీఎం కేసీఆర్ ఫోటో దిగారు.

ఈ నెల రోజుల వ్యవధిలో మొత్తం 12 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వచ్చారు. ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించారు. అయితే కొత్త సచివాలయంలోకి ప్రతిపక్ష నాయకులను రానివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ సమస్యలు తెలియజేసేందుకు సచివాలయంలోకి వచ్చే ప్రయత్నం చేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లను బయటే అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. కొత్త సచివాలయంలో ప్రతిపక్ష నేతలకు నో ఎంట్రీనా..? ప్రజలనైనా రానిస్తారా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News