E-Paper
Advertisement

Revanth Reddy Kamareddy : పచ్చని భూములు ఆక్రమించుకోవడానికే కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy Kamareddy | కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చని భూములను ఆక్రమించుకోవాడానికే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.

Revanth Reddy Kamareddy : పచ్చని భూములు ఆక్రమించుకోవడానికే కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి
Advertisement
Revanth Reddy  today news

Revanth Reddy today news(Telangana election latest news)

కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చని భూములను ఆక్రమించుకోవాడానికే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.

సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మనిషి రక్తం రుచి మరిగిన పులి కేసీఆర్.. ఆ పులిని వేటాడడానికి వచ్చిన వేటగాడిగా నన్ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడికి పంపించారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్‌ను ఓడించడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాను. 40 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా గెలిపించారు.. అలాగే పదేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా కామారెడ్డికి వచ్చారా.. ఆయన ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకున్నాడా? లేదు. కామారెడ్డి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వారి సమస్యలు గురించి ఏనాడైనా విన్నాడా? అలాగే బీడి కార్మికులకు పేదరికంలో ఉన్నారు. వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు. ఈ సమస్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది. అందుకే కామారెడ్డి తీర్పు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాను,” అని చెప్పారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×