Megastar Chiranjeevi : తెలుగు సినీ అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పేరు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా చిరును ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే చిరు సెలెబ్రేటిలకు గైడెన్స్ బుక్ అయ్యాడు. ఈయన గురించి ఎంత చెప్పినా ఏదోకటి ఇంకా మిగిలే ఉంటుంది. ఎన్నో భాధలను భరించి, అవమానాలను దిగమింగుకొని ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒకటిగా ఎదిగాడు. అలాంటి చిరంజీవిని తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్ అందరి ముందే అరచి దారుణంగా అవమానించారట.. ఆ ఘటన వల్లే అతను ఇప్పుడు ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాడట.. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి చాలా కష్ట పడ్డారు. ఆయన కేరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో పాత్రలో నటించిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజ్‌కు ఎదగడానికి ఓ ప్రొడ్యూసర్ కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిరంజీవిని అంతగా అవమానించడానికి చిరు ఏం చేశాడు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అతను ఎవరు అనే విషయాన్ని చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు అందరికీ చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరు ఈ విషయం పై వివరించారు.. ఈ క్రమంలో చిరంజీవి తన కెరీర్‌లో ఎదురైనా అవమానాల ను చెప్పాడు.. స్టార్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. అయితే ఇక్కడ జరిగిన అవమానం కారణంగా అతనిలో కసి పెరిగిందని చెప్పింది.
చిరంజీవి నటించిన న్యాయం కోసం సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవని ఏదో తప్పు చేసినట్లు అందరి ముందే ఆ సినిమా నిర్మాత గట్టిగా అరిచినట్లు చిరంజీవి ఆ వీడియో లో చెప్పుకొచ్చాడు. షూటింగ్ టైంలో అందరి మధ్య ఆయన అరిచేసరికి ఆ టైం లో నాకు గుండె పిండేసినట్లు అయిపోయింది. నువ్వు ఏమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ ఆయన గట్టిగా అరిచారు. సెట్‌లో అందరి ముందు అలా అరవడం నాకు అవమానంగా అనిపించింది.. అతను నన్ను అందరి ముందు సూపర్ స్టార్ అనేలా చేసుకోవాలని కసి తో సినిమాలు చేసేలా చేసిందని ఆయన అన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ అని అతనే అనేలా చెయ్యాలని అనుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు సినిమాల కథల విషయం లో కాస్త జాగ్రత్తలు తీసుకొని వరుస హిట్ సినిమాల్లో నటించాడు. ఈ వయసులో కూడా చిరు సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే చిరు కు ఈ మధ్య అవార్డుల పంట పండింది. ఒకే నెలలో మూడు అవార్డులు ఆయన సొంతం అయ్యాయి. ఇక చిరంజీవి సినిమాలకు, డ్యాన్సులకు, ఎన్నో అవార్డులు దక్కాయి. అందులో ఈ ఏడాది మూడు అవార్డులను అందుకున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు..