BigTV English

KCR: సొంత ఇంటిని చక్కబెట్టిన కేసీఆర్, ఆపై అమెరికా వ్యూహం

KCR:  సొంత ఇంటిని చక్కబెట్టిన కేసీఆర్, ఆపై అమెరికా వ్యూహం

KCR: బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో ఏం జరిగింది? పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీలో మార్పులు జరగబోతున్నాయా? వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్యను పెంచుతున్నారా? నేతల నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు చేశారు? రేపోమాపో కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో అమెరికా వెళ్లడంపై అనుమానాలు మొదలయ్యాయా? ఇవే ప్రశ్నలు పార్టీ కేడర్‌ను వెంటాడుతున్నాయి.


 కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అడుగులు వేయకుంటే పార్టీ మటాష్ అవుతుందని భావించారట పెద్దాయన. ఆ విధంగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. బీసీల అంశం పార్టీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో పాత అంశాలను ప్రస్తావించినట్టు కొందరు నేతలు చెబుతున్నారు.


పార్టీలో ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కరే ఉన్నారు. ఆ సంఖ్యను నాలుగుకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారట పార్టీ అధినేత. ఇప్పటివరకు కేటీఆర్ ఒక్కటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండేవారు. కేటీఆర్‌తోపాటు మరో ముగ్గురికి అవకాశం కల్పించనున్నా రట. వారిలో మహిళలకు ఎక్కువగా ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల మాట. ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ, ఇంకొకరు టాప్ కమ్యూనిటీకి చెందిన మహిళ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ ఇంతలా దిగజారి పోవటానికి మీరే కారణమని కొందరు సీనియర్లు తప్పుబట్టారని తెలుస్తోంది. తొలుత ఇంటి సమస్యలు సరిదిద్దుకుంటే, ప్రత్యర్థులకు ధీటుగా బదులు ఇవ్వవచ్చని చెప్పినట్టు సమాచారం. ఒకానొక దశలో యువనేతపై కేసీఆర్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల మాట. ఇంటిని చక్కదిద్దుకునే పనిలో భాగంగా హాజరైన నేతల నుంచి అభిప్రాయసేకరణ చేశారు.

ALSO READ: కేసీఆర్‌పై కేసు పెట్టిన వ్యక్తి హత్య

ఇంటి నుంచే ప్రక్షాళన

పార్టీలకు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహణ, కొన్ని కమిటీలకు ఇన్‌ఛార్జ్‌గా హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో మహిళలు బీఆర్ఎస్‌ను చావదెబ్బ కొట్టారని కేసీఆర్‌కు పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో పార్టీలో మహిళలకు పెద్ద పీఠ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి అధ్యక్షురాలిగా కవితను నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఫారెన్ టూర్ మాటేంటి?

మరోవైపు కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదిక తుది దశకు చేరింది. రేపో మాపో రేవంత్ ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా టూర్‌కి శ్రీకారం చుట్టడంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇందులోభాగంగా ఫామ్ హౌస్ నుంచి పార్టీ ఆఫీసుకు వెళ్లకుండా కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు వెళ్లారని అంటున్నారు.

ప్రభుత్వం మారిన వెంటనే డిప్లమాటిక్ పాస్‌పోర్టును అప్పగిస్తారు మాజీ ముఖ్యమంత్రులు. ఏడాది తర్వాత  డిప్లమాటిక్ పాస్‌పోర్టు ఇవ్వరని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ జగన్ విషయాన్ని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ అమెరికాలో ఉండేందుకు రెండునెలలుగా తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఫారెన్ టూర్ వెళ్లడం పక్కాగా ఖాయమన్నమాట.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×