BigTV English

Actor Subbaraju : ‘బాహుబలి’ చేసి తప్పు చేశాను.. అయ్యో ఏమైందన్నా..?

Actor Subbaraju : ‘బాహుబలి’ చేసి తప్పు చేశాను.. అయ్యో ఏమైందన్నా..?

Actor Subbaraju : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా, విలన్ గా పలు సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సుబ్బరాజు( Subbaraju ) .. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ ( KrishnaVamshi ) కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన సుబ్బరాజు.. అనుకోకుండా సినీ అవకాశం దక్కించుకున్నారు. ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. విలన్ గా ఎన్నో పాత్రలో నటించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. ఆయన నటించిన సినిమాలు మొత్తం మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అన్నీ సినిమాల కన్నా బాహుబలి లో ఆయన చేసిన క్యారెక్టర్ కు దేశ విదేశాల్లో మంచి పేరును అందించింది. అలాంటి సినిమాపై సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో. మంచి క్రేజ్ అందించిన సినిమాపై ఇలాంటి కామెంట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు… బాహుబలి వల్ల ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


సుబ్బరాజు పర్సనల్ లైఫ్..

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో నటించిన సుబ్బరాజుకు మంచి గుర్తింపు దక్కింది. పూరి జగన్నాధ్‌ సినిమాలలో వరుసగా నటిస్తూ.. పాపులర్ అయ్యారు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించి స్టార్‌ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా.. అన్ని పాత్రల్లో అలరించారు. తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేశారు. అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. అందులో అన్నీ హిట్ సినిమాలు కావడం విశేషం.. బాహుబలి మూవీ స్పెషల్ అనే చెప్పాలి. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా వల్ల ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సుబ్బరాజు మాత్రం ఈ సినిమా వల్ల నేను చాలా నష్టపోయాను అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అదేంటది మంచి క్రేజ్ వస్తే నష్టపోవడం ఎందుకు అని అనుమానం వ్యక్తం అవుతుంది కదూ.. దానికి ఓ రీజన్ ఉంది అదేంటో ఆయన ఏం చెప్పారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


Also Read :బిగ్ బాస్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్..బాబోయ్ బూతులే..

‘బాహుబలి ‘ వల్ల ఇబ్బందులు పడ్డాను..?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ బాహుబలి.. యుద్దాలు వంటివి ఆరోజుల్లో ఎలా ఉన్నాయి అనేది ఈ మూవీలో చూపించారు. సినిమా స్టోరీ, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ మూవీ సిరీస్ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకుంది. దాంతో భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా కలెక్షన్స్ కూడా రాబట్టి ఇండియన్ మూవీ చరిత్రను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటించాడు సుబ్బరాజు.. ఈ సినిమా వల్ల పేరు వచ్చింది. కానీ నష్టాలను కూడా చూపించిందని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుబ్బరాజు ఈ విషయాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. బాహుబలి వల్ల పేరు వచ్చింది.. కాని నాకు నష్టాన్ని కూడా మిగిల్చింది అన్నారు. ఆ సినిమా చేస్తున్నంత కాలం వేరే సినిమాలు చెయ్యలేక పోయాను. అవి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అలా చాలా నష్ట పోయాను అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో రాజమౌలితో సినిమాలంటే అంత ఈజీ కాదు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

ఇక రీసెంట్ గా ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌తో పాటు పలువురు ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బరాజు సతీమణి గురించి డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు..

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×