Gundeninda GudiGantalu Today episode November 22 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు నానమ్మను కారులో గుడికి తీసుకొని వెళ్లాలని కారు ఓనర్ గణపతి దగ్గరకు వెళ్తాడు. కారుకు డబ్బులు తీసుకొని మళ్లీ మళ్లీ మీ దగ్గరకు రావడం తప్పే.. నా పరిస్థితి బాగోలేక మా నాన్న ఆరోగ్యం కోసం అమ్మేసాను. ఇక బాలు ఫీలింగ్ అర్థం చేసుకున్న.. ఆ వ్యక్తి కారు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక వెంటనే బాలు.. ఇంటికి వచ్చి గుడికి వెళ్దాం అంటూ హడావిడి చేస్తాడు. గుడికి తీసుకెళ్లాక బాలుకి ట్విస్ట్ ఇస్తుంది మీనా. మామయ్య ఆరోగ్యం బాగుంటే మీతో గుడి మొత్తం పొర్లు దండాలు పెట్టిస్తాను అని మొక్కుకున్న అన్నాను అంటుంది. ఇలా తన నాన్న పేరు చెప్పి బాలుతో పొర్లు దండాలు పెట్టిస్తుంది. దీంతో బాలు కి చుక్కలు కనిపిస్తాయి. నమ్మకద్రోహం చేసావ్ అని మీనాపై కొప్పాడుతాడు బాలు. పక్కనే ఉన్న శీలా డార్లింగ్.. ‘మీ తాతయ్య కోసం మీ నాన్న చేశాడు. ఇప్పుడు మీ నాన్న కోసం నువ్వు చేసావు. ఇందులో తప్ప ఏముందంటూ షాక్ ఇస్తుంది. తనకు తన భామ నుండి ఫోన్ వచ్చిందని, తనని ఇంటికి రమ్మని పిలుస్తున్నారని చెబుతాడు రవి. మీ బామ్మకు అసలు విషయం తెలియదు కావచ్చు. అందుకే పిలిచిందని ఏదో సందేహపడుతుంది శృతి. ఇక పండుగ పూట అన్ని పనులు తాను ఒక్కదాన్నే పనులు చేసుకోవాలని అంటూ ప్రభావతి ఇంట్లో అరుస్తుంది. ఇంతలోనే తన అత్తమ్మ వచ్చింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుశీల మీనాను వెనకేసుకొని వస్తుంది. ప్రభావతి అది చూసి కోపంతో రగిలిపోతుంది. గారెలు కూడా వెయ్యలేదు అనగానే దానికి మీనా గుడికి వెళ్లొచ్చాము కదా అత్తయ్య ఇప్పుడు వేస్తాను అంటుంది. దానికి సుశీల మాత్రం ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. ఆ మాత్రం వేసుకోలేరా అని అంటుంది. నీ ముద్దుల కోడలితో వేయించు అంటుంది. ప్రభావతి చదువుకున్న అమ్మాయి కదా అత్తయ్య ఆమెకు ఇలాంటివి రావు. వంట చెయ్యడం అస్సలు రాదు అని అంటుంది. నీకు పెళ్ళైన కొత్తలో వంట చెయ్యడం వస్తుందా.. నేను మెల్లగా నేర్పించాను కదా అంటుంది. ఇక అత్త మాటను విన్న ప్రభావతి రోహిణి దగ్గరకు వెళ్తుంది.
మా అత్తయ్య పండగపూట మొదటి వంట ఇంటికి పెద్ద కోడలు చేయాలని పట్టుబడుతుందని చెబుతుంది. దీంతో ‘నాకు చేయడం రాదు కదా..’ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణీ. ఒకటంటే ఒకే వాయి అని.. ఇలా వేసి అలా వచ్చేయి అని రోహిణిని రిక్వెస్ట్ చేస్తుంది. వంటింట్లోకి వెళ్లగానే సుశీలమ్మ.. రోహిణిని ఓ రేంజ్ లో క్లాస్ పీకుతుంది. పనులు చేస్తేనే వస్తానే.. మహారాణిలా కూర్చొంటే రావని అంటుంది. పిండి తీసుకొని గారెలు వెయ్యమని ఆర్డర్ వేస్తోంది. తనకు చేయడం రాదంటూ.. తప్పించుకుని ప్రయత్నం చేస్తుంది. కానీ.. నిన్ను నేర్పిస్తాలే అంటూ దగ్గర ఉంది మరి వేపిస్తుంది. ఇలా చేస్తే.. తనతో మొత్తం పని చేపిస్తారనీ భావించిన రోహిణి తనకు తలనొస్తుందంటూ, కళ్లు తిరుగుతున్నాయని అబద్దం చెప్పి నటిస్తుంది. ఇక అది విన్న ప్రభావతి మాత్రం అయ్యో రామ్మ అని తీసుకొని బయటకు వస్తుంది. తల అంతా మంట గా ఉందని చెప్పగానే తడి బట్ట తెచ్చి తల మీద పెడుతుంది.
అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ సుగుణమ్మ అక్కడకు వస్తుంది. ఏమైందమ్మ.. ఏమైంది.. అంటూ అరుస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ సరిగా వచ్చేస్తారు. రోహిణికి తన నిజం ఎక్కడ బయటపడుతుందని టెన్షన్ పడుతుంది. ప్రభావతి వచ్చి ఎందుకలా అరుస్తున్నావు. ‘అయినా రోహిణికి నీకు సంబంధం ఏంటి?’ అని నిలదీస్తుంది ప్రభావతి. లేదు.. రోహిణి తలపై బట్టలు చూసి ఏదైనా గాయం అయ్యిందా అని కంగారు పడ్డానని కవర్ చేస్తుంది సుశీలమ్మ. ఇంతలోనే బాలు కూడా ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది అందరూ కంగారుగా ఉన్నారు. ఏం జరిగింది? అంటూ ఆరా తీస్తారు.. రోహిణి తలపై గుడ్డను చూసి ఏమైనా గాయం అయ్యుండొచ్చు అని బాధపడ్డానని చెప్పుకొస్తుంది. తాము ఇక్కడే ఉంటే.. ఎక్కడ నిజం బయటపడుతుందోననీ, మేం వెళ్తున్నామంటూ చెబుతోంది సుగుణమ్మ. దీంతో బాలు.. పండగ పూట ఇంటికి వచ్చిన వారు భోజనం చేయకుండా వెళ్తారా? తినేసి వెళ్లండి? అని చెబుతాడు. సత్యం కూడా.. పండగపూట ఇంటికి వచ్చే వారిని ఖాళీ కడుపుతో పంపడం సరికాదని, తిన్నాక వెళ్లండని చెబుతాడు. ప్రభావతి మాత్రం ఆవిడ ఎందుకని సత్యంను అడుగుతుంది. రోహిణి టెన్షన్ పడిపోతుంది. మీనా తన రూమ్ కు తీసుకొని వెళ్తుంది.
అప్పుడే ఇంట్లోకి రవి వస్తాడు. బయట నుంచి చూసిన బాలు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. పండగపూట ఇంటికి ఎందుకు వచ్చావు? అని నిలదీస్తాడు. తనకు బామ్మ ఫోన్ ఇంటికి రమ్మని పిలిచిందనీ, అందుకే ఇంటికి వచ్చానని చెబుతాడు రవి. ‘నువ్వు చేసిన ఘనకార్యం తెలిస్తే బామ్మనే చీ కోట్టి బయటకు పంపిస్తుందని, అనవసరంగా పండగ పూట .. ఇంటికి వచ్చి గొడవ చేయకుండా వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు.. ఇక సుగుణమ్మ దగ్గరకు రోహిణి వెళ్తుంది. ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ తన తల్లిని అడుగుతుంది. తనకు ఎవరో ఫోన్ చేసి.. నీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పారని, ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చూసి.. అది దినేష్ నెంబర్ అని తెలుసుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి ఫోన్లు వచ్చినా.. మరోసారి ఇంటికి మాత్రం రావద్దని వార్నింగ్ ఇస్తుంది. మీనా రూమ్ కి రావడాన్ని గమనించిన రోహిణి.. సరే.. భయపడకు నాకేం కాలేదు కదా .మీరేం ఫీల్ అవ్వకండి నేను అర్థం చేసుకోగలను అంటూ కవరింగ్ చేస్తుంది. రోహిణి బయటికి వెళ్లగానే.. మీకు రోహిణి ముందే తెలుసు కదా అంటూ సుగుణమ్మను ప్రశ్నిస్తుంది.. ఆమె షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..