Brahmamudi serial today Episode: ఆఫీసు నుంచి డల్లుగా ఇంటికి వచ్చిన రాజ్ ను అందరూ కావ్య ఎక్కడ అని అడుగుతారు. నువ్వే కావ్యను తీసుకురావడానికి ఇగో అడ్డొచ్చి తీసుకురాలేదా..? అని అడుగుతారు. వెనకాల ఆటోలో వస్తుందా..? అంటూ అపర్ణ అడుగుతుంది. వీడి ముఖం చూస్తుంటే అలాగే ఉన్నట్టుంది అంటుంది ఇందిరాదేవి. ఇంతలో రాజ్ ఏదు కావ్యకు ఆటో బుక్ చేసి పంపించాను అని చెప్పగానే.. అందరూ ఎందుకు కార్లో తీసుకురావచ్చు కదా? అంటారు. కార్లో రావడానికి ఆవిడ గారు ఇక్కడికి రాలేదు. శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోయింది. పందెంలో నేను గెలిచాను అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రాహుల్, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు.
రాజ్ కూడా రుద్రాణి దగ్గరకు వెళ్లి అత్తా నేనే గెలిచాను. మంచి సాంగ్ పెట్టు డాన్స్ చేద్దాం అంటాడు. రుద్రాణి సాంగ్ పెడుతుంది. సంతోషంతో రాజ్ డాన్స్ చేస్తాడు. రుద్రాణి కూడా చేస్తుంది. కోపంగా అపర్ణ హారతి పక్కన పెట్టి ఆపండి అంటూ తిడుతుంది. సిగ్గు లేదా…? నీకు అని నిలదీస్తుంది. దీంతో రాజ్ నేను ఓడిపోవాలని ఎంతలా కోరుకున్నారు. ఆ కళావతి గెలవాలని ఎన్ని పూజలు చేశారు. నా టాలెంట్ తో కళావతిని ఓడించి.. పుట్టింటికి పంపించేసి.. సీఈవోగా బాధ్యతలు చేపట్టి.. దిగ్విజయంగా ఇంటికి తిరిగి వచ్చాను అని రాజ్ చెప్పగానే కొడుకు ఓడిపోవాలని కోరుకున్న మథర్ గారు ఇప్పుడేమంటారు. ఏం కోడలు పిల్ల నువ్వు మళ్లీ హారతి వెలిగించి మా రాజ్‌కు నీరాజనాలు పట్టడానికి నిప్పులు కావాలా..? అని స్వప్నను అడుగుతుంది రుద్రాణి.
పైశాచిక ఆనందం అంటే ఏంటో నీ కళ్లల్లో కనిపిస్తుంది అత్త అంటూ తిడుతుంది. ఇంతలో సీతారామయ్యా వస్తాడు. నువ్వు నా మనవడివి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాను రాజ్ అంటాడు. నేను గెలవడం మీకు అంత సిగ్గుగా ఉందా తాతయ్య అనగానే.. ఏమైందని అందరూ అడగ్గానే కావ్య వేసిన డిజైన్స్ ను వీడు కొట్టేసి మోసం చేసి పందెంలో గెలిచాడు. ఇది ఒక గెలుపేనా..? అంటూ నిలదీస్తాడు. దీంతో ఓడిపోయిన కళావతి నిజం చెప్పి మీతో సింపథి కొట్టాయలనుకుందా.? అని అడుగుతాడు. దీంతో కావ్యకు అలాంటి మనస్తత్వం ఉంటే నేను నిన్ను ఎప్పుడో కంపెనీలో నుంచి గెంటేసేవాడిని. అంటూ రాజ్‌ను తిడతాడు.
నువ్వు ఇంత చేసినా నిన్ను గెలిపించి తను మౌనంగా వెళ్లిపోయింది అంటాడు. దీంతో స్వప్న నాకు ఇప్పుడు రాహుల్‌కు నీకు తేడా కనిపించడం లేదు అంటుంది. అపర్ణ కూడా రాజ్ ను తిడుతుంది. అందరూ రాజ్‌ను తిడుతూ.. ఈ పందెంలో కావ్య గెలిచింది. కాబట్టి నువ్వు వెళ్లి కావ్యను ఇంటికి తీసుకురాపో అని చెప్తారు. లేదంటే నువ్వు మోసం చేసి కావ్యను ఓడించావని నేనే ఆఫీసులో చెప్తాను అంటాడు సీతారామయ్య. దీంతో రాజ్ నేను ఓడిపోయానని ఆఫీసులో చెప్పినా.. నేను కావ్యను ఇంటికి తీసుకురానని చెప్తాడు రాజ్. అంతకంటే విడాకులు ఇవ్వడమే నాకు ఇష్టం ఇప్పుడే కాదు ఎప్పటికీ కళావతిని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.
ఇంట్లో కూర్చుని అన్నం తింటున్న కావ్య దగ్గరకు కనకం వచ్చి నాకేం నచ్చలేదే అంటుంది. నాకైతే నచ్చింది.. ఇంతులో అన్ని కరెక్టుగా సరిపోయాయి. వీటికి తోడు అప్పడాలు కూడా ఉన్నాయి కదా..? అంటుంది కావ్య. నేను అంటుంది నీ పద్దతి గురించి అని కనకం అనగానే ఎందుకు పద్దతిగానే తింటున్నాను కదా..? అంటుంది. దీంతో కనకం పందెంలో ఓడిపోయానన్న బాధ కానీ.. అత్తారింటికి దూరం అయ్యానన్న బాధ కానీ.. భర్తకు దూరం అయ్యానన్న బాధ కూడా లేదా నీకు అని అడుగుతుంది.
జరిగిందేదో జరిగిపోయింది. పందెలో నేను ఓడిపోవాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఓడిపోయాను అంటుంది. ఇంతలో కావ్యకు సీతారామయ్య ఫోన్ చేసి ఎందుకు రిజైన్ చేసి వెళ్లిపోయావు అని అడుగుతాడు. ఓడిపోయిన వారు ఆయనకు ఆ కంపెనీకి దూరంగా వెళ్లిపోవాలని మన డీల్ కదా..? అని చెప్తుంది. కానీ రాజ్ మోసం చేసి గెలవడం కరెక్టు కాదు. నిన్ను మళ్లీ సీఈవోను చేస్తాను అని చెప్తాడు. దీంతో కావ్య ఆయనకు నా మీద మంచి అభిప్రాయం లేదు. నేను ఆ కంపెనీకి సీఈవో అవ్వడం ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా గెలవాలనుకున్నారు.. గెలిచారు అని చెప్తుంది. ఇక నా వల్ల కాదు తాతయ్య నన్ను క్షమించండి అని ఫోన్ కట్ చేస్తుంది కావ్య.
కావ్య మాటలు విన్న కనకం ఏడుస్తుంది. భోజనం తినడం ఆపేసిన కావ్య కూడా ఏడుస్తుంది. మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ ఆలోచిస్తుంటారు. రాజ్, కావ్యను ఎలా కలపాలని వాళ్లిద్దరిని ఎలా ఒప్పించాలని బాధపడుతుంటారు. ఇంతలో కనకం, ఇందిరాదేవికి ఫోన్ చేసి ఏదైనా చేయాలన్నా.. చెప్పాలన్నా.. మీరే.. నా కూతురు అత్తవారింటికి వెళ్తుందని ఆశపడ్డాను. కానీ నా కూతురైతే ఏకంగా దుగ్గిరాల ఇంటితో సంబంధం తెగిపోయింది అంటుంది. ఇక నా కూతురుకు న్యాయం ఎవరు చేస్తారు అని అడుగుతుంది. నేను చేస్తాను. ఎన్ని గొడవలు జరిగినా సరే ఇప్పటికీ ఎప్పటికీ కావ్యే ఇంటి కోడలు దాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటూ అపర్ణ హామీ ఇస్తుంది. రెండు రోజుల్లో కావ్య ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెడుతుంది అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.