ఈ టైటిల్ చూసి… ఏ యుద్ధ రంగంలోనో పాకిస్థాన్ తన శత్రుదేశ సైనికుల రక్తం కళ్లజూస్తోందని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. పాకిస్థాన్ ప్రత్యర్థుల రక్తం కళ్లజూస్తున్నది యుద్ధరంగంలో కాదు… మైదానంలో. T20 వరల్డ్ కప్ లో పాక్ బౌలర్ల దారుణ బౌలింగ్ కు… ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు ఆస్పత్రి పాలయ్యారు.
నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో… పాక్ బౌలర్లు మిస్సైల్ లాంటి బంతులతో బ్యాటర్లను వణికించారు. ఆరో ఓవర్ వేసిన హరీస్ రౌఫ్… ఐదో బంతిని బౌన్సర్ గా విసరడంతో… అది కాస్తా నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడ్ హెల్మెట్ లోపలికి చొచ్చుకుని వెళ్లి… కంటి కింద తీవ్ర గాయమైంది. బంతి బలంగా తాకడంతో విలవిల్లాడిపోయిన లీడ్… కాసేపు క్రీజ్ లో కూలబడిపోయాడు. బంతి 142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి తగలడంతో… లీడ్ గాయం నుంచి రక్తం ధార కట్టింది. దీంతో ఆటగాళ్లు, మ్యాచ్ చూస్తున్న వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బంతి ఏ మాత్రం అటూఇటూ అయినా… లీడ్ తన కుడి కంటిని కోల్పోయే వాడు.
ఇక T20 వరల్డ్ కప్ లోనే ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ ఇలాంటి సీనే కనిపించింది. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రీదీ బుల్లెట్ల లాంటి యార్కర్లు విసరడంతో… అందులో ఒకటి ఆప్ఘన్ బ్యాటర్ గుర్జాబ్ ఎడమ కాలి వేళ్లకు బలంగా తాకింది. దీంతో గుర్జాబ్ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి గుర్బాజ్‌కు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో… సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ వచ్చి అతణ్ని భుజాల మీద మోసుకుని తీసుకువెళ్లాడు. దగ్గర్లోని ఆస్పత్రికి గుర్జాబ్‌ను తీసుకెళ్లాక… ఎడమ పాదానికి స్కానింగ్ చేసి… తీవ్ర గాయమైనట్లు గుర్తించారు. దాంతో… అతను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.