BigTV English

KCR: నేడు అసెంబ్లీకి కేసీఆర్.. కారణం అదేనట!

KCR: నేడు అసెంబ్లీకి కేసీఆర్.. కారణం అదేనట!

నేనొస్తున్నా..!


– నేడు అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు హాజరు కానున్న కేసీఆర్
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సన్నిహితుల నుంచి సమాచారం
– మన్మోహన్‌ ‌సింగ్ సంతాప తీర్మానంపై సుదీర్ఘ ప్రసంగం
– ఆయన కేబినెట్‌లో పనిచేసినప్పటి జ్ఞాపకాల ప్రస్తావన

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: KCR: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ఇవాళ జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజకీయాలతో, పార్టీతో సంబంధం లేకుండా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ వేదికగా పంచుకోడానికి కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే కేసీఆర్, ఈ ఒక్క రోజు సెషన్‌కు మాత్రం హాజరై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ సింగ్‌కు ఉన్న అభిప్రాయాన్ని, ఆయన తీసుకున్న చొరవ తదితరాలను సభా వేదికగా ప్రస్తావించే అవకాశమున్నది.


ఆనాటి విషయాలన్నీ పంచుకుంటారా?

మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో (యూపీఏ 1) కేసీఆర్ రెండేండ్ల పాటు కేంద్రమంత్రిగా కేబినెట్‌లో కొనసాగారు. పదేండ్ల పాటు మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో లోక్‌ సభ ఎంపీగా పార్లమెంటులో కంటిన్యూ అయ్యారు. ప్రధానిగా మన్‌మోహన్ సింగ్ తీసుకున్న పలు నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పథకాలు విప్లవాత్మకమైనవంటూ గతంలోనే సీఎం హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ కొనియాడారు. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా గుర్తు చేసే అవకాశమున్నది. సభకు హాజరుకానున్నట్లు సన్నిహితుల ద్వారా ఎమ్మెల్యేలకు కూడా సంకేతాలు అందాయి.

పార్టీ నేతల రిక్వెస్ట్‌తో నిర్ణయం

మన్మోహన్ సింగ్ గురించి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రస్తావించే అంశాలను ఇతర పార్టీల సభ్యులు వ్యతిరేకించే అవకాశం లేనందున సభకు హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మన్మోహన్ మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ సంతాపం తెలియజేశారు. ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు కేసీఆర్ హాజరవుతారని చాలామంది రాజకీయ నాయకులు భావించినా బీఆర్ఎస్ ప్రతినిధిగా కేటీఆర్‌ను పంపించారు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు కూడా హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు అభిప్రాయపడిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తుచేసే అవకాశమున్నది. తెలంగాణతో మన్మోహన్‌కు ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

Also Read: Azerbaijan president : ప్రమాణికుల విమానాన్ని ఆ దేశమే కూల్చేసింది.. సంచలన ప్రకటన చేసిన అజర్ బైజాన్ అధ్యక్షుడు..

కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ

మన్మోహన్‌ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రధానిగా ఆయన తెలంగాణకు చేసిన సేవలను కొనియాడుతూ అప్పట్లో ఆయన చేతుల మీదుగా ఉనికిలోకి వచ్చిన సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం, భూసేకరణ – పునరావాసం – పరిహారం చట్టం (2013) తదితరాల గురించి కేసీఆర్ ప్రస్తావించే అవకాశమున్నది. తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా పనిచేసే పరిణతి చెందిన రాజకీయ నాయకుడని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆయనను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఆయన మరణం దేశానికి తీరని లోటు అని సంతాప సందేశంలో కేసీఆర్ పేర్కొన్నారు

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×