
Revanth Reddy latest news(Telangana politics): వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికాలో తానా సభలకు హాజరైన రేవంత్‌రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానం ఏంటనే ప్రశ్నకు స్పందించారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ విధానం… కేసీఆర్ స్వార్థం కోసమేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో ఉచిత విద్యుత్ అంశంలో TPCC చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని రేవంత్ అన్నారని, ఉచిత విద్యుత్ రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ది అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచనలకు నిరసనగా ఇవాళ, రేపు నిరసనలు చేపట్టాలన్న కేటీఆర్… ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. గతంలోనూ కరెంట్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ మండిపడ్డారు.
వ్యవసాయానికి ఫ్రీ పవర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుపట్టారు. ఎరువుల సరఫరా సహా ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్న తెలంగాణ రైతులపై రేవంత్ పిడుగు వేశారని ఫైరయ్యారు. దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. గతంలో 9 గంటల హామీనే కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.