ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీతో పాటు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో మైగ్రేట్ అయినవారి గురించి ప్రత్యేకంగా చర్చించామని.. ఇందిరమ్మ ఇళ్లను అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి.
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. తెలుగుకు పెద్దపీట చేసిన మార్పులు ఏంటంటే
రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు న్యాయం జరగాలని, పేద ప్రజల సొంతింటి కళ నిజం చేయాలని, ప్రజలు స్వచ్చందంగా.. సానుకూలంగా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ప్రజల సహకారం కావాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్,2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ నీ 10 లక్షలకు పెంచాం అన్నారు.
దీంతోపాటు 5 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. సన్న వడ్లకు 500 బోనస్, డైట్ చార్జీలు పెంచాం.. అన్నారు. రైతు భరోసా రూ.12000, భూమి లేని రైతు కూలీలకు కూడా 12 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తాం అని.. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూంలు పూర్తి చేస్తాం అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. రైతుభరోసా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఎకరాకు 12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే సాయం దక్కనుంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతుభరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది.