Naga Shourya:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగశౌర్య (Naga Sourya). ఇక ఈయన తల్లి ఉషా మల్పూరి (Usha Malpuri) నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఉష మాట్లాడుతూ.. నాగశౌర్య చిన్నప్పుడే నాతో పెళ్లి అయ్యాక మాత్రం నేను నీతో కలిసి ఉండను అని అనేవాడు. ఎందుకురా అని అడిగితే, ఇద్దరు మంచివాళ్ళు ఒకచోట ఉండకూడదు అని చెప్పేవాడు. మొదటి నుంచి అదే చెబుతూ ఉండేవాడు కాబట్టి పెళ్లయిన తర్వాత కూడా వాడు అలాగే చేశాడు. పెళ్లయ్యాక కొడుకు – కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది నాగశౌర్యకి ఒక పాప కూడా పుట్టింది. నవంబర్లోనే మనవరాలి మొదటి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము. పాపను చాలా మిస్ అవుతున్నాను. వీడియో కాల్ లో మాత్రమే చూస్తూ ఉంటాను. అదొక్కటే నా బాధ.ఇటీవల తను నాతో పాటు ఒక నెలన్నర రోజులు మాత్రమే ఉంది. కానీ రెస్టారెంట్ పనుల వల్ల నేను బిజీగా ఉండడంతో ఇప్పుడు తరచూ తన దగ్గరకు వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపచంగా బ్రతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని, వెళ్లిపోయాక మన జీవితం శూన్యం అయిపోతుంది.
ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..
ముఖ్యంగా పిల్లలు పెద్దయ్యాక పిల్లలతో మనం ఎలా ఉండాలి అనేది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికి ఏ సలహా ఇవ్వకూడదు, ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి. ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. సాధారణంగా మనం వద్దని చెప్పినంత మాత్రాన వాళ్లు చేసే పనిని ఆపేయరు. సరేనని తలూపుతే మన గౌరవమైనా నిలబడుతుంది నేను కూడా అదే పాటిస్తున్నాను అంటూ ఉషా తెలిపింది. ఏది ఏమైనా అందరూ తల్లులలాగే ఉషా కూడా ఆలోచిస్తోందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నాగశౌర్య కంటే వాడే మేలు..
నాగశౌర్య గురించి కూడా మాట్లాడుతూ.. శౌర్య ఎప్పుడూ కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. సంతోషమైన విషయాలు చెప్పకపోయినా పర్లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి కదా.. నాకు పెద్దబ్బాయి అంటేనే చాలా ఇష్టం. వాడు ఏ విషయమైనా సరే నాతో పంచుకుంటాడు. చిన్నప్పుడు ఇద్దరికీ కూడా ఆస్తమా ఉండేది. ఆ కారణంగానే ఎక్కువగా స్కూల్ కి కూడా వెళ్లేవారు కాదు అని ఇంట్లోనే ఇద్దరినీ చదివించేదాన్ని. అలాంటిది పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని నాకు తెలుసు, అందుకే ఆ బాధ నుంచి బయటపడడానికి కూడా కొంత సమయం పట్టింది అంటూ తెలిపింది ఉష. మొత్తానికైతే అందరి ఇళ్లలో ఉండే సమస్యలే. అందుకే తాను కూడా ఒక తల్లినే కాబట్టి తాను కూడా ప్రతి ఒక్కదానికి కాంప్రమైజ్ అవుతున్నాను అంటూ ఉష తెలిపింది. ఇక ప్రస్తుతం నాగ శౌర్య తల్లి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి