E-Paper
Advertisement

Ganja Seizure: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!

Ganja Seizure: హర్యానా నెంబర్ ప్లేటుతో మారుతి కారు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!
Advertisement

Ganja Seizure: తెలంగాణలోకి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో.. ఒడిశా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి నిల్వలను ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం పట్టుకుంది. నిరంతరం నిఘా ఉంచుతున్న అధికారులు.. పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ Ch. శ్రీహరిరావు , వారి సిబ్బంది వైరా ఐఎంఎఫ్ఎల్ (IMFL) డిపో ఎదురుగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న ఓ మారుతి కారును ఆపారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అందులో దాచి ఉంచిన 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్ లభ్యమయ్యాయి. పట్టుబడిన మత్తు పదార్థాలు, కారు , సెల్ ఫోన్ కలిపి మొత్తం రూ. 67 లక్షల 20వేల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Advertisement

ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాం S/O ఇస్లాముద్దీన్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కారుకు HR 07 N 6184 అనే నకిలీ హర్యానా నంబర్ ప్లేటును వాడినట్లు గుర్తించారు. ఒడిశాలోని కలిమెల ప్రాంతం నుండి ఈ గంజాయిని సేకరించి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

సమర్థవంతంగా పనిచేసి గంజాయి ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ G. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ G. గణేష్‌, ఎన్ఫోర్స్మెంట్ టీమును ఎక్సైజ్ ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Also Read: మంత్రి ఆదేశం.. మున్సిపాలిటీ యాక్షన్.. మారుతున్న ధర్మపురి రూపురేఖలు!

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×