BigTV English

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకు స్థాపన చేశారు. గోద్రెజ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన భూమిని గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారని రైతులు ఆందోళన చేశారు. జిల్లా అధికారులే బెదిరించి వంద ఎకరాలకు పైగా భూమిని తమ వద్ద నుంచి సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భూమిని ఇచ్చిన తర్వాత కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.5 లక్షలు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని.. ఇక చేసేది ఏమీ లేక అందోళన బాట పట్టామని రైతులు తెలిపారు.


Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×