BigTV English

Supreme Court: బెయిల్‌ పిటిషన్లు ఆలస్యం చేయరాదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య..

Supreme Court: బెయిల్‌ పిటిషన్లు ఆలస్యం చేయరాదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య..

Supreme Court: బెయిల్‌.. ముందస్తు బెయిల్‌లు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవని.. అటువంటి పిటిషన్లు ఆలస్యం చేయకుండా త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్‌ సీటీ రవి కుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ చీటింగ్‌, ఫోర్జరీకి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇందుకు సంబంధించి 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. అయినప్పటికీ.. మునుపటి పరిస్థితులు పునరావృతమవుతోన్న దృష్ట్యా బెయిల్‌.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని మరోసారి సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు సంబంధించి ఓ చీటింగ్‌, ఫోర్జరీ కేసును ఇటీవల సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసు విచారణకు స్వీకరించిన తర్వాత దాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణ తేదీని ప్రకటించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధితులు.

సుప్రీం ధర్మాసనం చీటిింగ్ కేసుకు సంబంధించిన తదుపరి తేదీని ఎందుకు ప్రకటించలేదని ఛత్తీఘడ్ కోర్టును ప్రశ్నించింది. కాలక్రమానుసారం ఆ పిటిషన్‌ను లిస్ట్‌ చేయాలని సమాధానం చెప్పడంతో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి వాటిపై గతంలో పలుసార్లు సూచనలు చేసినప్పటికీ మళ్లీ ఇలాంటి పరిస్థితులే పునరావృతం అవుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×