BigTV English

Khammam murder mystery end: ప్రియురాలి మాటలు.. సినిమా స్టయిల్‌లో నెలన్నర తర్వాత ?

Khammam murder mystery end: ప్రియురాలి మాటలు.. సినిమా స్టయిల్‌లో నెలన్నర తర్వాత ?

Khammam murder mystery updates(Telangana today news): క్రైమ్ సినిమాల్లో సస్పెన్స్ ఏమోగానీ, దాన్ని మించిపోయింది ఈ కేసు. ప్రియురాలి మోజులో పడి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని దారుణంగా చంపేశాడు కసాయి డాక్టరు. నిండు నూరేళ్లు నిండకుండానే ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పైగా యాక్సిడెంట్‌లో చనిపోయారంటూ బంధువులను నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.


ఖమ్మం జిల్లాలోని రామనగర్‌కు చెందిన 28 ఏళ్ల కుమారికి బావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్‌తో ఐదేళ్ల కిందట మ్యారేజ్ అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు.. చాలా ముచ్చటగా ఉండేవారు. ప్రవీణ్ హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అడుతూ పాడుతూ సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. డాక్టర్ ప్రవీణ్‌కు కేరళకు చెందిన  యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కుమారికి తెలియడంతో భర్తతో పలుమార్లు గొడవపడింది.

నాలుగు గోడల మధ్య వివాదం కాస్తా.. నలుగురి మధ్యకు వచ్చింది. పంచాయతీ పెద్దలు భార్యభర్తలకు నచ్చజెప్పారు. ఈ వ్యవహారం ప్రియురాలికి ఇబ్బందిగా మారింది. భార్య, పిల్లలను లేకుంటే మనం హాయిగా ఉంచవచ్చని డాక్టర్ ప్రియుడికి సలహా ఇచ్చింది. ఏది మంచో, ఏది చెడో తెలియని పరిస్థితిలో పడిపోయాడు ప్రవీణ్. చివరకు ఓకే చెప్పాడు. ఎలా చంపాలన్న దానిపై ప్రియురాలితో కలిసి స్కెచ్ వేశాడు కసాయి డాక్టర్.


ALSO READ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? బండి సంజయ్ లీక్..?

సరిగ్గా మే నెలలో సొంతూరులో పనులు ఉన్నాయని చెప్పి ఆసుపత్రిలో సెలవు పెట్టాడు డాక్టర్ ప్రవీణ్. ఫ్యామిలీతో కలిసి ఖమ్మం బయలుదేరాడు. మత్తు డాక్టర్ కావడంతో పక్కాగా ప్లాన్ చేశాడు. మే 26న భార్య కుమారిని చంపాలని ప్లాన్ చేశాడు. కానీ అది ఫెయిలైపోయింది. భార్యా పిల్లలను ఎంత తొందరగా వదిలించుకుంటే హాయిగా ఎంజాయ్ చేయవచ్చని ఆలోచన పదేపదే డాక్టర్ మనసులో మెదిలింది. సరిగ్గా 28న ఆధార్ కార్డులను అప్ డేట్ చేయాలంటూ భార్యా పిల్లలతో కలిసి కారులో ఖమ్మం వెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో మెడికల్ షాపులో కాల్షియం ఇంజెక్షన్లు కొనుగోలు చేశాడు. కారులో కొద్ది దూరం వెళ్లాక వైఫ్‌ను వెనుక సీట్లో పడుకోబెట్టి రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆపి చిన్నారుల ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. భార్య చనిపోయిందని మృతదేహాలతో ఇంటికి బయలుదేరాడు.

వెళ్లే దారిలో కారు డ్యామేజ్ అయ్యేలా ప్లాన్ చేసి చెట్టుకు బలంగా ఢీ కొట్టాడు. రోడ్డు ప్రమాదంలో భార్య, పిల్లలు చనిపోయారని బంధువులను నమ్మించాడు. అయినా అత్తింటివారికి డౌట్ వెంటాడుతోంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.

కేసు నమోదు చేసి 40రోజులు గడిచింది. హత్య జరిగిందని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలు లభించలేదు. చివరకు కారును చెక్ చేశారు. ఖాళీ సిరంజ్ దొరికింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాత పోస్టుమార్టం, ల్యాబ్ రిపోర్టు పరిశీలించగా ముమ్మాటికీ హత్య అని తేలిపోయింది. చేసిన నేరాల్ని అంగీకరించడంతో పోలీసులు డాక్టర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేశాడు. యాక్సిడెంట్ కేసు కాస్త మర్డర్‌గా మారి హంతకుడు చిక్కాడు.

 

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×