BigTV English

BJP: భేదాభిప్రాయాలు ఉన్నా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

BJP: భేదాభిప్రాయాలు ఉన్నా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

BJP: బీజేపీ. బీజేపీ. బీజేపీ. తెలంగాణలో బీజేపీ పేరు మారుమోగిపోతోంది. బీజేపీ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కమలనాథుల దూకుడు మామూలుగా లేదు. మునుగోడులో ఓడినా.. గెలిచినంత జోష్. ఫాంహౌజ్ కేసు ఉన్నా తగ్గేదేలే అనేలా స్పీడ్. అట్లుంది బీజేపీతోని.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. నాయకులను మరింతగా రాటు దేల్చేగా.. మూడు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టింది. జాతీయ స్థాయి నేతలు.. లోకల్ లీడర్లకు పార్టీ సిద్ధాంతాలు, వ్యూహాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. సాధించాల్సిన లక్ష్యాల గురించి వివరిస్తున్నారు. కొత్తగా బీజేపీలో చేరిన నాయకులకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయుక్తంగా ఉండనుంది. కేవలం శిక్షణ మాత్రమే కాదు అంతర్గత విభేదాల మీదా చర్చ జరుగుతుందని అంటున్నారు.

ఇక, ట్రైనింగ్ ప్రోగ్రామ్ వేదికగా.. కేసీఆర్, టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు బీజేపీ అగ్రనేతలు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని.. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు కిషన్‌రెడ్డి.


అంటే, బీజేపీలో లుకలుకలు ఉన్నాయనే ప్రచారాన్ని కిషన్ రెడ్డి బహిరంగంగా ఒప్పుకున్నట్టేనా? అంటున్నారు. బండి సంజయ్ కు ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఇంకో గ్రూపు.. అగ్రనేతలంతా వేరు వేరు గ్రూపులు కడుతుండటంపై ఇటీవల అధిష్టానం సైతం సీరియస్ అయింది. గతంలో కరీంనగర్ లో జరిగిన సీక్రెట్ మీటింగ్ పై గట్టిగానే హెచ్చరించింది. ఇటీవలి మునుగోడు ఉపఎన్నికలోనూ సీనియర్లంతా కలిసి పని చేయలేదని చెబుతున్నారు. అందుకే, చిన్నచిన్న భేదాభిప్రాయాలంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్.. పార్టీలో పెద్ద టాపిక్ గా మారింది.

ఇక, బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో దూకుడు పెంచాలన్నారు కిషన్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు ఇచ్చిన నిధులపై పవర్ఱ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధించారని.. ఈడీ, సీబీఐ, ఐటీలు ఊరికే కూర్చుంటాయా? అని ప్రశ్నించారు.

శామిర్ పేటలోని లియోనియ రిసార్ట్స్ లో బీజేపీ శిక్షణ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యదర్శులు హాజరయ్యారు. మరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది మరింత ఆసక్తికరం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×