BigTV English

Gun Fire: క్లబ్ లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..

Gun Fire: క్లబ్ లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..

Gun Fire: మళ్లీ తుపాకీ పేలింది. ఉన్మాది గన్ తో రెచ్చిపోయాడు. నైట్ క్లబ్ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. 18 మందికి గాయాలయ్యాయి. అమెరికాలోని కొలరాడోలోని ‘క్లబ్ క్యూ’ అనే నైట్ క్లబ్ లో జరిగిందీ బీభత్సం.


కాల్పుల సమాచారంతో వెంటనే స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు. క్లబ్ ను చుట్టుముట్టారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

‘క్లబ్ క్యూ’ నైట్‌క్లబ్‌ను ప్రత్యేకంగా స్వలింగ సంపర్కుల కోసం నిర్వహిస్తున్నారు. కావాలనే తమపై ధ్వేషంతో దాడి చేశారని ఆ వర్గం ఆరోపిస్తోంది. గతంలోనూ ఓర్లాండోలోని ఓ హోమో సెక్సువల్స్ క్లబ్ పై కాల్పులు జరగ్గా ఆ ఘటనలో 49 మంది చనిపోయారు. ఇప్పుడు అలాంటి దారుణమే మళ్లీ జరగడంపై స్వలింగ సంపర్కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అయితే, కాల్పుల ఘటనకు అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల విచారణ తర్వాతే స్పష్టత రానుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×