E-Paper
Advertisement

ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Revanth Reddy: గాంధీభవన్‌లో జరిగిన సీఏసీ సమావేశంలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు గట్టిగానే పట్టుబట్టి కూర్చొన్నారు. అయితే, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త సంయమనంతో వ్యవహరించారు.

ఈ ఒక్కసారికి వదిలేద్దాం..

Advertisement

సమావేశంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని కొందరు నేతలు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘ఈ ఒక్కసారికి వదిలేద్దాం’ అని అన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు రావడం మంచిది కాదనే ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని నేతలు భావిస్తున్నారు.

మరోసారి రిపీట్ అయితే కఠిన చర్యలే!

Advertisement

ఈసారికి వదిలేసినా.. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకూడదని సీఎం అన్నారు. మరోసారి పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టిగానే హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

సమస్యలుంటే ఇన్‌ఛార్జ్‌కు చెప్పండి

ప్రభుత్వ పనితీరుపై గానీ, తన వల్ల గానీ, లేదా మంత్రులతో గానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మీడియా ముందుకు వెళ్లకుండా పార్టీ ఇన్‌ఛార్జ్‌కు ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఏ సమస్య ఉన్నా పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలకు తావివ్వకూడదని ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

Tags

Related News

నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

తెలంగాణ ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జ్ మొదటి ప్రసంగం.. ఏమన్నారంటే..?

తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

Big Stories

Advertisement
×