E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం
Advertisement

Revanth Convoy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. పాతబస్తీలోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి మీదుగా సీఎం కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా ఒక ఎద్దు రోడ్డుపైకి దూసుకురావడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తి

Advertisement

కాన్వాయ్ వేగంగా వస్తున్న సమయంలో ఎద్దు నేరుగా వాహనాలకు ఎదురుగా రావడంతో ఏం జరుగుతుందోనని అందరూ కంగారుపడ్డారు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి వేగంగా స్పందించి ఆ ఎద్దును చాకచక్యంగా పక్కకు లాగేశారు. దీంతో సీఎం కాన్వాయ్ ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షితంగా ముందుకు సాగింది. పెను ముప్పు తప్పడంతో అక్కడున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

తెలంగాణ ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జ్ మొదటి ప్రసంగం.. ఏమన్నారంటే..?

తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

Big Stories

Advertisement
×