BigTV English

Komatireddy venkat reddy : కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రిపై కోమటిరెడ్డి ఫైర్..

Komatireddy venkat reddy : యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలపారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్‌, సిటింగ్‌ జడ్జి విచారణ జరుగుతుందని వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్ రెడ్డేనని పేర్కొన్నారు.

Komatireddy venkat reddy : కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రిపై కోమటిరెడ్డి ఫైర్..
telangana politics

Komatireddy venkat reddy news(telangana politics):

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్‌, సిటింగ్‌ జడ్జి విచారణ జరుగుతుందని వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్ రెడ్డేనని పేర్కొన్నారు.


రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూలిపోదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పూర్తికాలం అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మిగలరని హెద్దేశా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని ప్రకటించారు. నల్గొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంతో పాటు తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేశానని గుర్తు చేశారు. అలాంటిది మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తన కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆయనకు రూ.వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో‌లో తాము ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని తెలిపారు. వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ కరెంట్ బిల్లులు కట్టవద్దు అనే మాటలు మానుకోవాలని వెంకట్ రెడ్డి సూచించారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×