E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్య..

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ నేతలపై రోడ్డు,రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ద్వజమెత్తారు. అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందన్నారు.

Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్య..
Advertisement

Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్ నేతలపై రోడ్డు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ధ్వజమెత్తారు. అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందన్నారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై.. సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే యాక్షన్ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక ఆ పార్టీ నాలుగు ముక్కులు అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

కాగా, ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీపై ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాగా, అధికారం కోల్పోవడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయన్నారు. చేరికకు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారని.. హస్తం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే గోడ దూకేందుకు ఆ పార్టీ నేతలు రెడీ ఉన్నట్లు సమాచారమన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ అన్నాదమ్ములు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×