BigTV English

Roshan Kanakala : ఇక అసలు ట్రోలింగ్ షురూ బ్రదర్ .. వైరల్ అవుతున్న బబుల్ గమ్ హీరో స్పీచ్..

Roshan Kanakala : ఇక అసలు ట్రోలింగ్ షురూ బ్రదర్ .. వైరల్ అవుతున్న బబుల్ గమ్ హీరో స్పీచ్..
Roshan Kanakala

Roshan Kanakala : సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది పలు రకాల అంశాలపై చర్చలు జరగడం కామన్. అయితే కొంతమంది చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేసి జరగనివి కూడా జరిగాయి అని చెప్పి పాపులర్ అవ్వాలి అని ప్రయత్నిస్తారు. సుమ కొడుకు రోషన్ కనకాల కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ పక్కన పెట్టి తన టాలెంట్ ను నిరూపించుకోమని సలహా కూడా ఇస్తున్నారు. ట్రోలింగ్ చేయకపోయినా పబ్లిసిటీ కోసం ట్రోలింగ్ చేశారు అని అనడం ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీస్తోంది.


ఇటు బుల్లితెర అటు వెండితెర రెండు కవర్ చేసే ప్రముఖ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ అనే యూత్ ఫుల్ లవ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జనవరి 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది. తొలిసారి మూవీ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన రోషన్ ఎంతో కాన్ఫిడెంట్గా ఎక్కడా బెరుకు లేకుండా స్పీచ్  ఇచ్చాడు. అతని కాన్ఫిడెన్స్ చూసి ఈవెంట్ కి వచ్చిన నాచురల్ స్టార్ నాని కూడా అవాక్కయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో రోషన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అతని సినిమాపై అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ చూసి అందరూ పొగిడారు కూడా.

అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడుతున్న రోషన్.. తనపై కొన్ని విమర్శలు వచ్చాయని.. ‘చాలాసార్లు నేనే విన్నాను.. నా వెనక మాట్లాడుకోవడం గమనించాను.. వీడు హీరో మెటీరియల్ కాదు.. వీడు హీరో ఏంటి.. మస్తు కర్రీ గా ఉన్నాడు విమర్శించారు. నేను ఇలాగే పుట్టా ..ఇలాగే ఉంటా.. ఒక మనిషి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ .. మనిషి కష్టపడే తత్వం ప్రతిభ అతని సక్సెస్ను డిసైడ్ చేస్తుంది.. మనందరి తలరాతల్లో ఏం రాసుందో ఎవ్వడికీ తెల్వదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా.. ఔకాత్ అయినా.’ అని ఎమోషనల్ గా ఒక స్పీచ్ ఇచ్చాడు.


ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు ఇప్పటివరకు సుమ కొడుకుని ఎవరు ట్రోలింగ్ చేశారు అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇతని పట్టించుకునే అంత ఖాళీ సమయం ఎవరికీ లేదని.. మొదటిసారి సుమా కొడుకుగా అతని చూస్తున్నామని కొందరు నెటిజన్స్ ఎగతాళి చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం ఏదో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి సింపతి కోసం ఇలా చేస్తున్నాడు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇక రోషన్ ఇలా మాట్లాడుతుంటే సుమా తనదైన శైలిలో మొహంలో బాధ ఎమోషన్స్ తో కూడిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. మరికొందరైతే ఇప్పటివరకు ట్రోలింగ్ జరిగిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు అసలు ట్రోలింగ్ మొదలవుతుంది బ్రదర్ అని అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×