E-Paper
Advertisement

Komatireddy : శ్రీతేజ ఆరోగ్యంపై కోమటిరెడ్డి సంచలన విషయాలు.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన మంత్రి

Komatireddy : శ్రీతేజ ఆరోగ్యంపై కోమటిరెడ్డి సంచలన విషయాలు.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన మంత్రి
Advertisement

Komatireddy : పుష్పా సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. శ్రీతేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసులో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుమం.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని దగ్గరకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్కును శ్రీతేజ తండ్రికి అందించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ప్రకటించారు.

Advertisement

ప్రస్తుతానికి బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా కిమ్స్ లో ప్రత్యేక చికిత్స పొందుతున్న ఈ బాలుడిని చూసిన కోమటిరెడ్డి.. శ్రీ తేజ ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని, కోలుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించానని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి..  30 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ఉన్న తనకు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి చుస్తే భయమేస్తోందని వ్యాఖ్యానించారు. శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి 1, 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు.. కోలుకున్నా మాటలు వస్తాయో రావో తెలియదని తెలిపారు.

శ్రీతేజ తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పిన కోమటిరెడ్డి..  అతని ఇద్దరు పిల్లల చదువు కోసం కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేస్తామని ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ పై కేసు దర్యాప్తు జరుగుతుందన్న కోమటి రెడ్డి.. కోర్టు పరిధిలోని అంశంపై తాను మాట్లాడనని తెలిపారు. శ్రీతేజ మెరుగైన ఆరోగ్యం కోసం.. అవసరమైతే అమెరికా నుంచి మెడిసిన్ తెప్పిస్తామని ప్రకటించారు.

Advertisement

ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి.. రాష్ట్రంలో పుష్పా 2 తో బెనిఫిట్ షోలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. పుష్పా 2 నేను కూడా చూసానన్న కోమటిరెడ్డి.. ఇకపై తెలుగు సినిమాలు చూడనని ప్రకటించారు. ఆ మూడు గంటలు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×