Unstoppable S4:ప్రముఖ ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే (Unstoppable with NBK). ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)తో ప్రారంభమైన ఈ సీజన్.. ఇప్పటికే చాలామంది ఈ షోలో సందడి చేశారు. ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోలు ఈ షో కి వచ్చి సందడి చేశారు. తమ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేస్తూ.. తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఇకపోతే చివరిగా నవీన్ పోలిశెట్టి(Naveen polishetty), శ్రీ లీల(Sreeleela ) వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరో బాలయ్య(Balayya) తో కలిసి సందడి చేయడానికి సిద్ధం అయిపోయారు.
బాలయ్య షోలో సందడి చేయనున్న వెంకటేష్..
సాధారణంగా ఒక జనరేషన్ కి సంబంధించిన ఇద్దరు హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే, ఎంతలా అభిమానులు సంబరపడిపోతారో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి ఆ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, ఇక ఆ సందడి ఎంతలా ఉంటుందంటే పండుగకు మించి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ (Venkatesh)అలియాస్ వెంకీ మామ.. తన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కి గెస్ట్ గా రాబోతున్నారు. ఈ మేరకు ఆహా టీం వేదికపై వీళ్ళిద్దరూ కనిపించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది అని చెప్పవచ్చు. అసలు ఏమైందంటే.. త్వరలో ఏడవ ఎపిసోడ్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఆహా ఓటీటీ టీమ్ బాలయ్య, వెంకటేష్ ఏఐ జనరేటర్ ఫోటోలతో పాటు ఒక ఒరిజినల్ ఫోటో కూడా షేర్ చేసి “బాలయ్య – వెంకీ మామ ఒకే స్టేజి మీద ఎప్పుడు చూడనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ కి సిద్ధం అవ్వండమ్మా” అంటూ పోస్ట్ షేర్ చేసింది.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం..
ఇక సంక్రాంతికి అనగా జనవరి 14వ తేదీన వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ అన్ స్టాపబుల్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ మరింత పండగ వాతావరణంలా మారబోతోంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి షోలో కనిపించబోతుండడంతో ఇరు హీరోల అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ కూడా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే వెంకటేష్ సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్న నేపథ్యంలో పనిలో పనిగా ఆ సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడ జరగబోతోంది.. సరదాగా మాట్లాడే వెంకి మామ, బాలయ్య కలిసి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
Venky mama , Balayya oke stage meeda 😎 Never before ever after entertaining episode ki ready avvandi amma .#aha #UnstoppableS4 #nandamuribalakrishna #Nandamuribalakrishna #UnstoppableS4 #NBK #Sankranthi @VenkyMama pic.twitter.com/355ff1gJZ1
— ahavideoin (@ahavideoIN) December 21, 2024