Konda Surekha: రాహుల్ గాంధీ కులం ఏంటో, మతం ఏంటో చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. కులగణన ప్రారంభోత్సవ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఫారమ్ తీసుకెళ్తే తన కులమేంటో రాహుల్ చెబుతారని స్పష్టం చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేదే బీజేపీ అని ఫైర్ అయ్యారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందని తెలిపారు. బ్రిటిష్ కాలంలో కులగణన జరిగితే మళ్లీ ఇప్పటి వరకు జరగలేదన్నారు.
Also read: ఫార్ములా ఈ రేసింగ్ నిధులు గోల్‌మాల్.. దూకుడు పెంచిన ఏసీబీ, వారికి శిక్ష తప్పదా?
కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన అనౌన్స్ చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేసి తీరుతామని ఛాలెంజ్ చేశారని గుర్తు చేశారు. ఆ ఛాలెంజ్ స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఓ లక్ష్యంతో సమగ్ర కులగణన సర్వే చేపట్టారని చెప్పారు. దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పెట్టేందుకే సీఎం కలగణన ప్రారభించారన్నారు. ప్రొఫార్మాలో పొందుపరిచినట్టుగా 56 ప్రశ్నలకు సంబంధించి సర్వే చేసేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. ఒక్కొక్కరు 150 ఇండ్లను సర్వే చేయాలన్నారు. సర్వే చేసిన డేటా ఎక్కడా లీక్ అవ్వదని హామీ ఇచ్చారు.
ఏ పథకం అమలు చేయాలన్నా కులగణనలోని జనాభా శాతం ఆధారంగా అమలు చేస్తామన్నారు. సామాజిక సమన్యాయం జరగాలంటే ఈ సర్వే కచ్చితంగా చేయాల్సిందేనని చెప్పారు. ఇంత కాలం బాధపడ్డ బీసీలు కులగణన తరవాత ఎవ్వరినీ చేయి చాచి అడగాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రజలు ఉన్నంత వరకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం వ్యక్తుల డేటాను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నిన్న రాహుల్ గాంధీ ఎంతో గర్వంగా తెలంగాణలో కులగణన గురించి మాట్లాడారని అన్నారు.