Nara Rohit First Look In Bhairavam: ఏ భాషా పరిశ్రమలో అయినా మల్టీ స్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందుకే మల్టీ స్టారర్ సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అని మేకర్స్ కూడా నమ్ముతారు. ఇక తెలుగులో చాలాకాలం తర్వాత అత్యవసరంగా హిట్స్ కావాలనుకుంటున్న ముగ్గురు హీరోలు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వారే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్. ‘భైరవం’ (Bhairavam) అనే మూవీ కోసం ఈ ముగ్గురు చేతులు కలిపారు. ఇప్పటికే ఈ మూవీ నుండి బెల్లంకొండ ఫస్ట్ లుక్ విడుదలవ్వగా.. తాజాగా నారా రోహిత్ ఫస్ట్ లుక్ కూడా బయటికొచ్చింది.
ముందెన్నడూ చూడలేదు
హీరోగా పరిచయమయినప్పటి నుండి నారా రోహిత్ (Nara Rohit) రూటే సెపరేటు. ఇతర హీరోలలాగా కమర్షియల్ కథల్లో నటించడం, యాక్షన్ సినిమాల్లో నటించడం తనకు అలవాటు లేదు. అందుకే సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలవైపే ఎక్కువగా మొగ్గుచూపాడు. తనకు అవి హిట్ తెచ్చిపెట్టినా లేకపోయినా.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలవైపు మాత్రం పెద్దగా అడుగులు వేయలేదు. ఇంతలోనే ‘భైరవం’లో వైలెంట్‌గా తన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతో ఇది చూసి ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా తనను ముందెప్పుడూ చూడలేదని, దీని వల్ల తన కెరీర్ టర్న్ అయిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు.
Also Read: హీరో దర్శన్ నుండి ప్రాణహాని ఉంది.. రోడ్డెక్కిన లాయర్
వైలెంట్ లుక్
‘భైరవం’ నుండి విడుదలయిన నారా రోహిత్ ఫస్ట్ లుక్‌లో తను ఒక చేతిలో ఆయుధం పట్టుకొని కనిపించాడు. అంతే కాకుండా మరొక చేతితో ఒక వ్యక్తిని చంపుతూ కనిపించాడు. నారా రోహిత్ ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ఈ రేంజ్‌లో వైలెంట్ లుక్‌ను ప్రేక్షకులు ఇంతవరకు చూడలేదని అనుకుంటున్నారు. పైగా ఈ సినిమాలో తను ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ‘నాంది, ‘ఉగ్రం’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు. ఈసారి ముగ్గురు హీరోలతో కలిసి ‘భైరవం’ అనే రీమేక్‌తో ఆడియన్స్‌ను మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు.
దానికి రీమేక్‌గా
సూరి హీరోగా తమిళంలో బ్లాక్‌బస్టర్ సాధించిన చిత్రమే ‘గరుడన్’. అందులో సూరితో పాటు శశికుమార్, ఉన్ని ముకుందన్ కూడా హీరోలుగా నటించారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas), నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj)లతో రీమేక్ చేస్తున్నాడు విజయ్ కనకమేడల. ‘భైరవం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి బెల్లంకొండ, నారా రోహిత్ ఫస్ట్ లుక్స్ బయటికి రాగా మంచు మనోజ్ లుక్ ఎఫ్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు ఒక్క హిట్ పడితే బాగుంటుంది అనే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి ‘భైరవం’ హిట్ అవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.