Actress Vijayashanthi: లేడీ సూపర్ స్టార్ ఎవరు అని ఇప్పటి జనరేషన్ ను అడిగితే.. అనుష్క, నయనతార, సాయిపల్లవి, త్రిష, సమంత.. ఇలా చాలా పేర్లు చెప్పుకొస్తారు. కానీ, టాలీవుడ్ కు అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి. ఆమె దగ్గర నుంచే ఈ ట్యాగ్ మొదలయ్యింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా కామన్. కానీ, స్టార్ హీరోల సినిమాల మధ్య కూడా.. ఒక హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి హిట్స్ అందుకుంది. సపరేట్ గా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి అనే చెప్పుకొస్తారు అభిమానులు.
ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం, ప్రతిఘటన.. ఇలా ఒక్కో సినిమా .. ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే ఎంత హైప్ ఉండేదో.. విజయశాంతి సినిమాలు వస్తున్నప్పుడు కూడా అంతే హైప్ ఉండేది అంట. ఒక ఆడది.. ఇంత హైప్ తెచ్చుకోవడం ఏంటి అని చాలామంది స్టార్ హీరోలే ఆశ్చర్యపోయేవారట. విజయశాంతి నటించిన ప్రతి సినిమా కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు.. ఒకనాయక సమయంలో సినిమాలకు మొత్తం గుడ్ బై చెప్పేసింది.
Tollywood Hero’s: సమంత పై సెటైర్లు పేల్చిన స్టార్ హీరోస్.. ఏమైందంటే..?
విజయశాంతి రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాలకు గుడ్ బై చెప్పిందని టాక్ నడిచింది. అందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియదు కానీ.. చాలాకాలం గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కూడా రాములమ్మ మంచి పాత్రనే అందుకుంది. తనకు కథ బాగా అనిపిస్తే నటిస్తాను అని అప్పుడే చెప్పిన ఆమె.. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
ఇక విజయశాంతి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఎప్పుడు ఆమె తన కుటుంబంతో బయటకు వచ్చింది లేదు. అసలు విజయశాంతికి పెళ్లి అయ్యిందా .. ? లేదా.. ? అనేది కూడా చాలామందికి తెలియదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో విజయశాంతి తన మనోగతాన్ని బయటపెట్టింది. తాను హీరోయిన్ గా ఒక స్టార్ పొజిషన్ లో ఉన్నప్పుడే తల్లితండ్రిని కోల్పోయాయని, తనను పెళ్లి చేసుకోమని అడిగేవారు కానీ, చేసేవారు కానీ ఆ సమయంలో లేరని ఎమోషనల్ అయ్యింది.
Ketika Sharma:ఎత్తుపల్లాలను ఎరగా వేసి.. ఇలా చూపిస్తే కుర్రవాళ్లను ఆపడం కష్టమే
” దేవాలయం షూటింగ్ జరుగుతుంది. ఒక కూతురు.. తండ్రికి నిప్పు పెట్టే సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సమయంలోనే నా ఫాదర్ కు హెల్త్ బాలేదని కాల్ వచ్చింది. వెంటనే డైరెక్టర్ గారు నన్ను ఇంటికి పంపించేశారు. నా తండ్రి అంటే నాకు ప్రాణం. ఆయనను అలాంటి పరిస్థితిలో నేను చూడలేకపోయాను. ఆయన చనిపోవడం నా జీవితంలో పెద్ద లోటు. ఇక నాన్న చనిపోయిన ఏడాదికే అమ్మ కాలం చేసింది. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. ఒంటరిదాన్ని అయిపోయాను. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో అప్పుడు అర్ధమయ్యింది. అప్పటివరకు వారు ఉన్నారనే ధైర్యం ఉండేది. వారు చనిపోయాకా.. నాకు పెళ్లి సంబంధాలు చూసేవారు కూడా లేరు. పెళ్లి చేసుకోమని చెప్పినవారు లేరు.
ఇక అలాంటి సమయంలో అసలు పెళ్లి వద్దు అనిపించింది. పెళ్లి చేసుకుంటేనే జీవితమా.. ? అని అనిపించింది. అప్పుడే నా జీవితంలోకి నా భర్త వచ్చారు. నన్ను ప్రోత్సహించి నా స్థాయిని మరింత పెంచారు” అని చెప్పుకొచ్చింది. ఇక విజయశాంతి భర్త పేరు MV శ్రీనివాసన్. ఆయన నందమూరి బాలకృష్ణ దగ్గర బంధువు అని సమాచారం. పెళ్లి తరువాత కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తరువాత విభేదాల వలన విడిపోయారని టాక్. ఇప్పటికీ వీరు కలిసి ఉంటున్నారా.. ? లేదా.. ? అనే విషయం కూడా ఎవరికి తెలియదు.