Konda Surekha on KCR: దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మెరుపులు చూశాం. చివరి బంతికి ఫోర్ కొట్టి అరుదైన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అయితే విరాట్ రికార్డుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు విడదీయలేని బంధం ఉందట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు సాక్షాత్తు మంత్రి కొండా సురేఖ. ఇండియా టీమ్ విజయాన్ని అందుకోవడంపై ట్వీట్ చేసిన కొండా సురేఖ.. ఓ కొత్త విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు.
ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎప్పుడూ ముందుంటారు. పని చేయని అధికారులను హెచ్చరించడంలోనూ, ప్రజలకు సేవ చేయడంలో మంత్రి తన మార్క్ ఖచ్చితంగా చూపిస్తారు. అంతేకాదు తనపై జరిగిన ట్రోలింగ్స్ పై సీరియస్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. అయితే మంత్రి కొండా సురేఖ సోమవారం ఓ ట్వీట్ చేశారు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మన క్రీడాకారులు గొప్ప ఆటతీరుతో ఆకట్టుకున్నారని, ఇండియా టీమ్ కు మంత్రి అభినందనలు తెలిపారు.
అలాగే ఈ మ్యాచ్ తో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీని ఉద్దేశించి, సూపర్ విరాట్ అంటూ మంత్రి కితాబిచ్చారు. కేవలం 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయాన్ని టీవీలో చూసి సంబరపడినట్లు, అలాగే విరాట్ పరుగుల రికార్డులో చివరిగా 4 పరుగులు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇంతవరకు ఓకే గానీ ఇక్కడే పొలిటికల్ కౌంటర్ వేశారు మంత్రి కొండా సురేఖ. మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. 14 వేల పరుగులు పూర్తి చేసుకొని విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టిస్తే, మాజీ సీఎం కేసీఆర్ కూడా అదే స్థాయి రికార్డ్ బద్దలు కొట్టినట్లు ట్వీట్ లో తెలిపారు.
14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 14 రోజులు కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదని, ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో కేసీఆర్ కూడా పెద్ద రికార్డే సాధించినట్లు మంత్రి సెటైరికల్ గా విమర్శించారు. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే.. 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతూ కూడా అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శలను కాంగ్రెస్ ఛాన్స్ దొరికితే ప్రచారం సాగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు బహిరంగ సభ వేదికల ద్వారా కేసీఆర్.. అసెంబ్లీకి రావాలని , తమకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయని పరిస్థితి. ఇటీవల పార్టీ సమావేశం నిమిత్తం బయటికి వచ్చిన కేసీఆర్, ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి ఎందుకు రాలేక పోతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Also Read: నీరా కేఫ్ వివాదం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారంపై స్పందించిన రేవంత్ సర్కార్
ఇలా కేసీఆర్ ను ఉద్దేశించి ఛాన్స్ దొరికితే విమర్శించే మంత్రి కొండా సురేఖ సెటైరికల్ గా ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. విరాట్ కోహ్లీ లాగా కేసీఆర్ కూడా రికార్డ్ సాధించారని, ఈ విషయాన్ని యావత్ దేశం గుర్తించాలని ఆమె కోరడం విశేషం. మరి మంత్రి కొండా కామెంట్స్ కి బీఆర్ఎస్ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.
దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో #teamindia ఘన విజయం సాధించడం హర్షణీయం.
6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం.
14 వేల రన్నులు కొట్టి @imVkohli రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత #kcr గారు కూడా దాదాపు ఈ… pic.twitter.com/OoOZpn2RRm
— Konda Surekha (@iamkondasurekha) February 24, 2025