Actor : సెలబ్రిటీలకు కొన్ని వింత అలవాట్లు ఉంటాయన్న విషయం తెలిసింది. అందరికీ కాకపోయినా, కొంతమంది మాత్రం ఉండే విచిత్రమైన అలవాట్లు అందరిని ఆశ్చర్యపరుస్తారు. తాజాగా ఓ ప్రముఖ హీరో భార్య ఆయన గురించిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. 4 గంటల పాటు తన భర్త బాత్రూంలో అదే పని చేస్తాడని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ఆయన వాష్ రూమ్ లో చేసే ఆ పని ఏంటో తెలుసుకుందాం పదండి.
హీరో సీక్రెట్ బయట పెట్టిన భార్య…
ప్రముఖ బాలీవుడ్ హీరో హిమేష్ రేష్మియా (Himesh Reshammiya) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్ కిస్సర్ గా ఆయన పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ హీరో తన భార్య సోనియా కపూర్ పాడ్ కాస్ట్ ‘ది సోనియా కపూర్ షో’ను స్టార్ట్ చేశారు. అక్కడ వీరిద్దరూ తమ సీక్రెట్స్ ని బయట పెట్టడం విశేషం. పాడ్ కాస్ట్ లో భాగంగా హిమేష్ రేష్మియా ఆయన కొత్త చిత్రం గురించి చర్చించారు. అందులో భాగంగా సోనియా తన భర్తకు గంటల తరబడి అద్దంలో తనను తాను చూస్తూ, మెచ్చుకునే అలవాటు ఉందని చెప్పి ఆట పట్టించింది.
ఈ షో సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నీలో నీకు ఇష్టమైన విషయం ఏంటి ? బాత్ రూమ్లో 4 గంటలు నిన్ను నువ్వు చూసుకోవడం తప్ప” అని జోక్ చేసింది. దీంతో ఆశ్చర్యపోయిన హిమేష్ “నువ్వు ఏం చెప్తున్నావు ? నా పేరు వాడుకుని నీ షోకి టిఆర్పి రేటింగ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నావా?” అని ఫన్నీగా అడిగాడు. అయితే సోనియా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా “నేను నిజాలే చెప్తున్నాను. నువ్వు ఇలాగే చేస్తావు… ఉదయం 9 గంటలకు విమానంలో ప్రయాణించాల్సి వస్తే తెల్లవారుజామున 3:00కే లేచి రెడీ అవుతావు. అలా ఎవరు చేస్తారు అసలు ? అని తిరిగి ప్రశ్నించింది. దీంతో హిమేష్ తనకు సిద్ధం కావడానికి సమయం కేటాయించడం ఇష్టమని, ప్రయాణంలో తొందరపడకూడదని సమర్ధించుకున్నాడు. అయినప్పటికీ సోనియా వదలకుండా “అవును. నువ్వు రెండు గంటలు అద్దంలో చూసుకుంటూనే ఉంటావు” అని బదులిచ్చింది. వెంటనే హిమేష్ “నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?” అని అడిగాడు. దీంతో సోనియా “క్షమించండి, మీ గురించిన సీక్రెట్ బయట పెడుతున్నాను” అని చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘బదాస్ రవికుమార్’ డిజాస్టర్
కాగా హిమేష్ రేష్మియా 2018లో సోనియా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆయన తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట వివాహం జరిగింది. ఇక హిమేష్ ‘ఆశిక్ బనాయా’, ‘ఝలక్ దిఖ్ లాజా’ వంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో పాపులరైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన ‘బదాస్ రవికుమార్’ (Badass Ravi Kumar) మూవీ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ 10 రోజుల్లో కేవలం రూ. 8.3 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం జునైద్ ఖాన్, ఖుషీ కపూర్‌ల రొమాంటిక్ డ్రామా ‘లవ్‌యాపా’ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది.