Tollywood:డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో త్రినాథరావు నక్కిన(Trinadh Rao Nakkina) ఒకరు. ఈయన మంచి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రవితేజ (Raviteja)తో తీసిన ‘ధమాకా’ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరడంతో ఈయనకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే అలాంటి త్రినాధరావు దర్శకత్వం వహించిన తాజా మూవీ ‘మజాకా’.. ఫిబ్రవరి 26న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబందించిన ఓ ఈవెంట్లో హీరోయిన్ అన్షు అంబానీ(Anshu ambani) పై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కి గురైన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు డైరెక్టర్ పై మహిళా కమిషన్ కూడా ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం త్రినాధరావుపై ఫైర్ అయ్యారు. దాంతో ఆయన వెంటనే క్షమాపణలు చెప్పారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు త్రినాధ రావు.
నేను మాట్లాడిన మాటలు హీరోయిన్ కి వివరంగా చెప్పాను..
ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్ అన్షు అంబానీ (Anshu Ambani) పై నేను చేసిన కామెంట్లు తప్పే.. కానీ ఆరోజు నేను అక్కడున్న వాళ్ళందరిని నవ్వించడం కోసమే ఆ మాటలు మాట్లాడాను. కానీ ఉద్దేశపూర్వకంగా ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలు ఎంత తప్పో నాకు తెలుసు. కానీ అనుకోకుండా అలా నా నోటి నుండి వచ్చేసాయి. ఆరోజు ఆ మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదు. నేను అనుకోకుండా నోరు జారాను. నా మాటల పట్ల మా అమ్మ చాలా బాధపడింది. అయితే నేను మాట్లాడిన మాటలు క్షణాల్లో నెట్టింట వైరల్ అయి సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఇదంతా అర్థం కాని అన్షూ నాకు ఫోన్ చేసి ఏమైందని అడిగింది. కానీ నేను మాట్లాడిన మాటలన్నీ వివరంగా చెప్పాను. దానికి ఆమె అర్థం చేసుకొని వదిలేయమని చెప్పింది.
ఒక్క మాటతో దుర్మార్గుడివి అయ్యావు – త్రినాధరావు తల్లి..
అలాగే నా వ్యాఖ్యల పట్ల మా అమ్మ చాలా బాధపడి సీరియస్ అయింది. ఇంకోసారి స్టేజ్ పై మాట్లాడేటప్పుడు అలా నోరు జారకు..ఇన్ని రోజులు సినిమాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకున్న నీవు ఒకే ఒక్క మాటతో దుర్మార్గుడివి అయిపోయావ్.నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. కానీ అందరికీ నువ్వు మంచి వాడివని చెప్పలేను కదా..ఇంకోసారి స్టేజ్ పై మాట్లాడేటప్పుడు నోరు జారకు అని నాకు వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు మా అమ్మ నాపై వచ్చే ట్రోలింగ్ కి దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లింది. దాంతో అమ్మని చూసి నేను కంగారు పడ్డాను. ఇప్పటి నుండి ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడను. అవి అనుకోకుండా మాట్లాడిన మాటలే.నేను కావాలని తప్పు చేయలేదు. ఒకవేళ నేను తప్పు చేశానని భావిస్తే మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను” అంటూ మరొకసారి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పుకున్నారు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మజాకా (Mazaka) టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అన్షూ బాడీ సైజ్ ల గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆయన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసాయి.