Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. గుండెపోటుకు గురై, స్పృహ లేని పరిస్థితిలో ఉన్న కృష్ణను ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ గురనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రికి తీసురాగానే ఎమర్జెన్సీలో వైద్యం అందించామని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే 20 నిమిషాలపాటు సీపీయూ చేసి పరిస్థితిని మెరుగుపర్చామని తెలిపారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని ప్రకటించారు. కృష్ణను కాపాడేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని గురునాథ్ రెడ్డి చెప్పారు. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి మీడియాకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ప్రతి గంట కీలకమని కృష్ణ కోలుకోవాలని ప్రార్థిద్దామని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ గురునాథ్ రెడ్డి అన్నారు. తమ అభిమాన నటుడు కృష్ణ కోలుకోవాలని సన్నిహితులు, ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
కృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్ లోనే ఉన్నారు. కృష్ణ పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడు ఏం జరిగింది?
ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కృష్ణ ఆస్పత్రికి తరలింపు
కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లు గుర్తించిన వైద్యులు
20 నిమిషాలపాటు సీపీయూ చేసిన వైద్యులు
ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
ప్రతి గంట కీలమన్న వైద్యులు
మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేమన్న వైద్యులు
మంగళవారం మధ్యాహ్నం మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ప్రకటన