Big Stories

Naga shourya : హీరో నాగశౌర్యకు అస్వస్థత.. గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స

Naga shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో షూటింగ్‌ జరుగుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు అత్యవసర చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు నాగ శౌర్యకు చికిత్స అందిస్తున్నారు. 6 నెలలుగా సిక్స్ ప్యాక్ కోసం నాగ శౌర్య కష్టపడుతున్నారు. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల షూటింగ్ లో సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

మరికొన్ని రోజుల్లోనే నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్​ డిజైనర్ అనూష శెట్టితో ఎంగేజ్ మెంట్ అయ్యింది. నవంబర్ 20న వివాహాన్ని బెంగళూరులో ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. ఈ సమయంలో నాగశౌర్య అస్వస్థతకు గురికావడంపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News