KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, ఆయన వ్యవహారశైలిలో అహంకారం తగ్గలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించినా.. కేటీఆర్ కు మాత్రం బుద్ధి రావడం లేదని రాజకీయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. గత పరిపాలనను సమర్థిస్తూ కేటీఆర్ బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. కేటీఆర్ చేసే విమర్శలు ఆయనలో ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. తాము చేసిన చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఓడిపోయామని కేటీఆర్ స్వయంగా అంగీకరించినప్పటికీ, ఆయన రాజకీయ వ్యూహాలు, ప్రసంగాల్లో మాత్రం అహంకారం ఏ మాత్రం తగ్గడం లేదు.
⦿ ఓటమి పాలైనా అహంకారం తగ్గడం లేదా..?
సీఎం అని గౌరవం లేకుండా.. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు. రేవంత్ సర్కార్ ను నెగిటివ్ చేసేందుకు సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎవరూ నమ్మడం లేదు. సీఎంపై, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కేటీఆర్ తాపత్రయ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు… ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. అయినా కేటీఆర్ కు మాత్రం ఆ అహంకారం తగ్గడం లేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రోజు జరిగిన సంఘటనను చూస్తేనే తెలుస్తోంది.. కేటీఆర్ ప్రవర్తన శైలి ఏంటో…
⦿ కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్..
కేటీఆర్, పార్టీ అనుబంధ విభాగమైన బీఆర్ఎస్‌వీ కార్యకర్తపై చేయి వేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన ఉప్పల్ లో జరిగిన తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సు సమయంలో చోటుచేసుకుందిది. కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి వేదికపైకి నడుస్తూ వస్తున్నారు. అయితే ఒక కార్యకర్త ఎదురుగా వస్తూ కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ క్షణంలో ఏమి జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, కేటీఆర్ తన చేతితో ఆ కార్యకర్త తలపై కొట్టినట్టు వీడియో స్పష్టం కనిపిస్తోంది..
⦿ సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ ఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే కార్యకర్తను పక్కన తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ కు ఏదో చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కార్యకర్తను సెక్యూరిటీ సిబ్బంది బలంగా నెట్టేసే సమయంలో.. కౌశిక్ రెడ్డి వారితో మాట్లాడి ఆపినట్టు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం. .ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా తెగ వైరల్ గా మారింది. వీడియోలో కేటీఆర్ చర్య, సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
⦿ దీనిపై కేటీఆర్ రియాక్ట్ అవుతారా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేటీఆర్ కు బుద్ధి రావడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు యువత ఓట్లు వేసే ప్రసక్తే లేదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘కేటీఆర్ నీకు ఇక అహంకారం తగ్గదా’ అని మరికొందరు వారి సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. రాష్ట్రంలో కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కేటీఆర్ ప్రవర్తనపై సంచలన విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా రియాక్ట్ అవ్వలేదు. పార్టీ నుంచి స్పష్టమైన వివరణ వస్తుందా..? అనేది చూడాలి మరి.. దీనిపై కేటీఆర్ రియాక్ట్ అవుతారా.. ఒకవేళ అయితే.. ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూద్దాం…
⦿ ఇదిగో వీడియో..
ALSO READ: Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భారీ నోటిఫికేషన్.. జస్ట్ వారం రోజులే ఇంకా.. రూ.85వేల జీతం