Copper Benefits: మన ఆహారంలో ఉండే రాగి (కాపర్) మెదడు ఆరోగ్యంలో మనం ఒకప్పుడు నమ్మిన దానికంటే ముఖ్య పాత్ర పోషిస్తుందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా అధ్యయనంలో, రాగి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తిన్న అమెరికన్లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పరీక్షలలో మెరుగ్గా రాణించారని వెల్లడైంది.
నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించబడిన తాజా పరిశోధనలో చాలా మంది ఆహారపు అలవాట్లను పరిశీలించి, వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైనవ వాటిని పరీక్షించాయి. ఈ అధ్యయనంలో, షెల్ఫిష్, డార్క్ చాక్లెట్, గింజలు వంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తిన్న వారు వయస్సు-సంబంధిత జ్ఞాపకశక్తి లోపం, చిత్తవైకల్యం (డిమెన్షియా) యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడానికి ఉపయోగించే పరీక్షలలో మెరుగ్గా రాణించారు.
రాగి – మెదడు ఆరోగ్యం- జ్ఞాపకశక్తికి బలమైన బంధం:
రాగి అనేది మెదడు కణాల మధ్య సంకేతాలను పంపే న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి, నరాలను రక్షించే మైలిన్ పొర ఏర్పడటానికి అంతే కాకుండా మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌ల పనితీరుకు కీలకమైనది. ఈ ప్రాథమిక విధులు మెదడు ఆరోగ్యానికి అత్యవసరం.
ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన అమిలాయిడ్ ఫలకాల పేరుకుపోవడాన్ని రాగి ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పరిశోధకులు ఆసక్తి చూపుతున్నారు. సరైన రాగి స్థాయిలు ఈ ఫలకాల పెరుగుదలను నివారించడంలో లేదా వాటిని తొలగించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. తద్వారా జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. రాగి సినాప్టిక్ ప్లాస్టిసిటీకి కీలకమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
రాగి ఎక్కువగా తినే వ్యక్తుల ఆహారంలో జింక్, ఐరన్, సెలీనియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అఅధిక ఆదాయం ఉన్న వ్యక్తులు తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన వైద్య సంరక్షణ, పరిశుభ్రమైన వాతావరణాలు, ఉన్నత విద్యను పొందగలుగుతారు – ఇవన్నీ జ్ఞాపకశక్తి లోపం , చిత్తవైకల్యం నుంచి రక్షించడానికి సహాయపడే అంశాలు.
ఇతర పరిశోధనలు ఏమి చెబుతున్నాయి ?
దీర్ఘకాలిక అధ్యయనాలు మెదడు ఆరోగ్యానికి రాగి ముఖ్యమనే ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి. ఒక అధ్యయనంలో ఆహారంలో రాగి తక్కువగా ఉన్నవారి జ్ఞాపకశక్తి , ఆలోచనలో ఎక్కువ క్షీణత కనిపించిందని తేలింది. మరింత ఆసక్తికరంగాజజ పరిశోధకులు మెదడు కణజాలంలో నేరుగా రాగి స్థాయిలను కొలిచినప్పుడు, అధిక సాంద్రతలు నెమ్మదిగా మానసిక క్షీణతతో సంబంధం కలిగి ఉన్నాయని, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన విషపూరిత అమిలాయిడ్ ఫలకాలు తక్కువగా ఉన్నాయని వారు కనుగొన్నారు.
Also Read: డయాబెటిస్ ఉన్న వారిలో.. గాయాలు త్వరగా ఎందుకు మానవు ?
రాగి అధికంగా లభించే ఆహారాలు ?
షెల్ ఫిష్
డార్క్ చాక్లెట్
గింజలు, విత్తనాలు (బాదం, జీడిపప్పు, అవిసె గింజలు)
పప్పు దినుసులు (కందులు, శనగలు)
ఆకుకూరలు (పాలకూర, కాలే)
పుట్టగొడుగులు