Gundeninda GudiGantalu Today episode November 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మీనాను తీసుకొని అత్త ఇంటికి వెళ్తాడు. మధ్యలో చీర కొనుక్కోమని సత్యం డబ్బులు ఇస్తాడు. అక్కడ చీర కొనుక్కొని బాలు మీనా ఇద్దరు బయలు దేరతారు. అయితే షాప్ నుంచి బయట రాగానే షేటు మనుషులు కారును తీసుకొని వెళ్తాము అని అంటారు. ర్యూడ్ గా బిహేవియర్ చేస్తారు. ఇక మీనా పోనివ్వండి అని కారు కీసును ఇస్తారు. ఇక ఆటోలో మీనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. పార్వతి వాళ్ళు అల్లుడు వచ్చాడని హడావిడి చేస్తారు. బాలు మీనా ఇంట్లోనే పరువు తీస్తాడు. మీనాను అబద్దాలు చెప్పేలా ట్రైనింగ్ ఇప్పించారా అని చురకలు అంటిస్తారు. ఇక మీనా పక్కకు తీసుకొని వెళ్తుంది. మీరు నాతో బాగున్నారని అందరు అనుకుంటున్నారు. మీరు ఇలా అనకండి అని అంటుంది. మన ఇంటికి వెళ్ళాక ఎన్ని అయిన తిట్టండి అంటుంది. సరే అలాగే అని అంటాడు. ఇక బాలు సేటు దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు.. అక్కడ సేటు అన్న మాటలకు బాలు సీరియస్ అవుతాడు. కారు వద్దని వెళ్ళిపోతాడు.. రోహిణి మాట వినలేదని.. అడ్డంగా ఇరికించాలని అనుకుంటాడు దినేష్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి దినేష్ తో మాట్లాడటం చూస్తుంది ప్రభావతి.. రోహిణి జాతకం బయట పడిందని అనుకుంటుంది. అతన్ని వెళ్లమని టెన్షన్ పడుతుంది. ఇకనుంచి వెళ్ళిపో మా అత్తగారు చూశారు అని లోపలికి వస్తుంది. ఎవరమ్మా అతను అంటే ఎవరు అడ్రస్ కోసం అడుగుతున్నారు అత్తయ్య అనేసి అంటుంది. ఇక మనోజ్ వెళ్తుండగా ప్రభావతి అడుగుతుంది. నువ్వు రేంజ్ పక్కనపెట్టి ఏదొక జాబ్ తెచ్చుకో అని అంటుంది. అందరి దగ్గర చులకన అయిపోయా మనము నేను అతిగా చేసి నేను ఇలా చేశాను అని నన్ను అందరూ అంటున్నారు అని ప్రభావతి మనోజ్ కి చివాట్లు పెడుతుంది.. ఇక రోహిణి తన మాట వినలేదని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రోహిణికి యాక్సిడెంట్ అయిందని దినేష్ ఫోన్ చేసి చెప్తాడు. ఇక మనోజ్ మలేషియాకు వెళ్లి రండి అని ప్రభావతి ఐడియా ఇస్తుంది. రోహిణిని ఎలాగైనా ఒపించి మలేషియా కెళ్ళమని చెప్తుంది. రోహిణి వింటుంది. ఇక రోహిణి దగ్గరకు వచ్చేసి ప్రభావతి మనోజ్ అడుగుతారు.
అదంతా పక్కనే ఉన్న రోహిణి వింటుంది. ఇప్పుడిప్పుడు నాన్నని క్రియేట్ చేయాలంటే ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి? విద్య నాకు ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని ఆలోచిస్తుంది. విద్యకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలు గురించి విద్యకు రోహిణి చెబుతుంది. విద్య ఫోన్ పెట్టే గాని రోహిణి దగ్గరికి ప్రభావతి మనోజ్ ఇద్దరు వస్తారు. కులముకునేదే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అల్లున్ని కూతుర్ని పండగపూట నువ్వు వెళ్లకపోతే ఏం బాగుంటుంది అందరూ చూసే వాళ్ళు నవ్వుతారు నాలుగు రకాలు మాటలు అనుకుంటారు నువ్వైనా అర్థం చేసుకో అమ్మ అనేసి రోహిణి ప్రభావతి అడుగుతుంది. మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేస్తే నేను మాట్లాడుతాను లేదా వీడు మాట్లాడతాడు. ఒకసారి అయితే మీరు వెళ్లి రండి అని ప్రభావతి అనగానే రోహిణి షాక్ అవుతుంది. కాసేపు ఆగితే మా నాన్న ఫోన్ చేస్తాడని అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తుంది.
సేటు తిట్టాడని కారు పోయిందని బాధతో బాలు మళ్లీ తాగేసి అత్తగారింటికి వెళ్తాడు. అక్కడ మీనా అని పిలుస్తాడు మీనా లేకపోవడంతో పార్వతి వచ్చి ఏం బాబు టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతుంది. మీ కూతురు ఎక్కడ అనేసి అడుగుతాడు. మీ ఇంటికి వెళ్ళింది బాబు అని పార్వతి చెబుతుంది.. పండక్కి పిలిచారు కదా మేము ఇక్కడికి వచ్చాం కదా మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఏం మూసుకుని వెళ్ళింది ఏం మోసుకుని వెళ్ళింది అని బాలు పార్వతి అంటాడు. మీనాకు కొంచెం కూడా బుద్ధి లేదు ఇప్పుడు నన్ను అక్కడ ఇరికించడానికి వెళ్లింది. దీనివల్ల నాకు అన్ని తలనొప్పులు అనేసి అనుకుంటూ ఇంటికి వెళ్తాడు.
ఇక కారు పోయిన విషయాన్ని రాజేష్ కి చెప్తాడు. ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాడు బాలు. మీ నాన్న పిలిచి అడుగుతాడు. ఏమైంది ఎందుకు వచ్చావు అని బాలు మీనాఅడుగుతాడు. రానన్న బలవంతంగా నన్ను తీసుకొని మీ పుట్టింటికి వెళ్లావు. పండక్కేదో ఉంటుంది కదా అని నేను అనుకున్నాను. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడంలో అర్థం ఏంటి అని మీ నాన్నను బాలు అడుగుతాడు. మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నారు కానీ మనం లేమని నేను నిజం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే అక్కడ ఉండడం నాకు ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు. రవి గురించి టాపిక్ మాట్లాడుతాడు. రవి పెళ్లి చేయడం వల్ల ఇదంతా జరిగింది నాకు కారు పోయిందని మీ నాతో అంటాడు. అప్పుడే బాలు వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వస్తుంది. నేను చూసిన ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకురా మీ నాతో గొడవ పడుతున్నావ్? రవి ఎక్కడికెళ్లాడు? అసలు మీనాని ఎందుకు తీసుకొచ్చావ్? ఏంటి ఏం జరుగుతుంది అసలు అనేసి అడుగుతుంది. దానికి మీనా ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. ఇక బామ్మకు అసలు నిజం తెలిసి పోతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..