Nindu Noorella Saavasam Serial Today Episode : నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో మేఘసందేశం సీరియల్ క్లబ్ అయింది. అందులోని అర్టిస్టులందరూ ఈ సీరియల్ లోకి వచ్చేశారు. దీంతో ఇవాళ కూడా సీరియల్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.
అందరూ కలిసి గుడిలో దీపాలు వెలిగించాలనుకుంటారు. ఇంతలో అమర్ వాటర్ తీసుకొచ్చి మిస్సమ్మకు ఇస్తాడు. అది చూసిన భూమి అమరేంద్ర గారు మీకు భాగీ అంటే చాలా ఇష్టమనుకుంటాను అని అడుగుతుంది. అయ్యో అదేం లేదండి ఇవాళ పాస్టింగ్ ఉంది కదా..? అందుకని వాటర్ ఇచ్చాను అంటాడు అమర్. దీన్నే మా ఊరిలో లవ్ అంటారు అని భూమి చెప్పగానే గగన్ తిడతాడు. ఊరికే వాళ్లను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ మొట్టికాయ వేస్తాడు. ఇంతలో మిస్సమ్మ మీరు ఈ భూమిని ఎలా భరిస్తున్నారండి అని గగన్ ను అడుగుతుంది. అయ్యో మా తల ప్రాణం తోకకొస్తుందండి తనతో.. ఇంట్లో అందరితో డాన్స్ చేయిస్తుంది అంటూ గగన్ చెప్తుంటే భూమి బుంగ మూతి పెడుతుంది. ఇంతలో మిస్సమ్మ పిల్లలను పిలుస్తుంది. అందరు వచ్చి దీపాలు వెలిగించండి అని చెప్తుంది. అందరూ దీపాలు వెలిగించి కళ్లు మూసుకుని దండం పెట్టుకుంటుంటే మనోహరి అక్కడకు వచ్చి దీపం నూనే బాటిల్స్ తీసేసి వాటి ప్లేస్ లో పెట్రోల్ బాటిల్స్ పెడుతుంది.
అదే గుడిలోకి వచ్చిన శోభా చంద్ర ఆత్మ భూమిని చూస్తూ రోదిల్లితూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. దూరం నుంచి గమనించిన గుప్త ఆరుకు ఆ తల్లి కార్చు ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నువ్వే బాలిక. ఆ బాలిక బాధను తీర్చబోయి.. ఈ తల్లికి తీరని బాధను మిగిల్చితివి అంటాడు. దీంతో అయితే ఆ తల్లి బాధను నేను తీర్చగలను గుప్త గారు. అంటూ దగ్గరకు వెళ్లి శోభాచంద్ర గారు. భూమి మీద ఉన్నందుకు.. పుణ్యం చేసుకున్నందుకు నాకు స్పర్శ శక్తిని ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తిని ఇవాళ మనసా వాచా మీకు ఇద్దామనుకుంటున్నాను అని చెప్తుంది ఆరు. దీంతో గుప్త షాకింగ్ గా చూస్తూ.. బాలిక నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? అటుల చేసిన ఎడల నీవు నీ శక్తిని కోల్పోయెదవు అని గుర్తు చేస్తాడు.
ఆరు పర్వాలేదు గుప్త గారు ఈవిడ తన కన్న కూతురుతో కొన్ని క్షణాలు కలిసి ఉంటుందంటే నా శక్తులు పోయినా పర్వాలేదు అని చెప్తుంది. శోభ కూడా ఆశ్చర్యంగా ముఖ పరిచయం కూడా లేని నాకోసం ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు అమ్మా.. అని అడుగుతుంది. కూతురుగా తల్లి లేని బాధ తెలుసు. తల్లిగా పిల్లలకు దూరంగా ఉన్న బాధ తెలుసు అంటూ ఆరు ఎమోషనల్ అవుతుంది. అయితే ఒక్కసారి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో బాలిక అంటాడు గుప్త. పర్వాలేదు గుప్త గారు అయినా ఒక తల్లి బిడ్డను కలపలేని శక్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత. నా శక్తి ఆమెకు వచ్చేటట్టు చేయండి గుప్తగారు అని చెప్తుంది. నీ త్యాగమును ఏ పేరున పిలవాలెనో తెలియడం లేదు బాలిక అంటూ గుప్త తన మంత్ర శక్తిని ఉపయోగించి ఆరు స్పర్శ శక్తి శోభాకు వచ్చేలా చేస్తాడు. అయితే స్పర్శ శక్తి వచ్చింది కదా అని నువ్వు నేరుగా వెళ్లి నీ బిడ్డను చూడొద్దు. తనకు నీ ముఖం కనిపించకుండా వెళ్లాలి అని షరతు పెడతాడు గుప్త అలాగేనని వెళ్తుంది శోభ.
భూమి వాళ్ళు దీపాలు వెలిగిస్తున్న దగ్గరకు వెళ్లి కొంగు ముఖానికి కప్పుకుని కూర్చుంటుంది శోభ. శోభను చూసిన భూమి అమ్మా.. అని పిలుస్తుంది. శోభ తిరిగి చూడగానే మీ కళ్లు అచ్చం మా అమ్మ కళ్లలాగే ఉన్నాయి అని చెప్తుంది. దూరం నుంచి గమనిస్తున్న ఆరు ఆశ్చర్యంగా ఏంటిది గుప్త గారు శోభ గారు భూమికి కనిపిస్తుందా..? అని అడుగుతుంది. నువ్వు నీ సోదరికి కనిపించుచుంటివి కదా..? నీ శక్తి ఈ బాలికకు ఇచ్చావు కదా..? అందుకే కనిపిస్తుంది అని గుప్త చెప్తాడు. తర్వాత శోభను భూమి మీ కళ్లు అచ్చం మ అమ్మ కళ్లలాగే ఉన్నాయని చెప్తూ నా కళ్లు కూడా మా అమ్మ కళ్లలాగే ఉంటాయంటారు. నిజమేనా అమ్మా అని అడుగుతుంది. మీ అమ్మను నేను చూడలేదు కదమ్మా.. కానీ నీ కళ్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయని చెప్తుంది శోభ.
అయితే మీ ముఖం నేను ఒకసారి చూడొచ్చా అమ్మా అని భూమి అడగ్గానే వద్దమ్మా నా ముఖానికి చిన్న గాయం అయింది అంటూ శోభాచంద్ర ఏడుస్తుంది. భూమి కూడా ఎమోషనల్ అవుతూ అయితే అమ్మా నాతో కలిసి ఈ దీపం వెలిగించండి అని అడుగుతుంది. సరేనని ఇద్దరూ కలిసి దీపం వెలిగిస్తారు. మరోవైపు ఆరు చేసిన త్యాగానికి గుప్త ఆరును మెచ్చుకుంటాడు. ఇంత మంచిదానికి నీతో విధి ఎందుకు ఇన్ని ఆటలాడుతుందని బాధపడతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.