E-Paper
Advertisement

సోలాపూర్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 8 మంది మృతి!

సోలాపూర్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 8 మంది మృతి!
Advertisement

Solapur Accident: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. సోలాపూర్ జిల్లాలో తాండుల్వాడి సమీపంలో పికప్ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో వ్యాన్ లో ఉన్నవారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ చౌగులే తన కుటుంబ సభ్యులతో కలిసి పికల్ ట్రిక్కులో దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. మస్వద్ నుంచి పండర్‌పూర్ వెళుతుంగా.. తాండూల్వాడి సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Also Read: ప్రయాణికుల పైనుంచి దూసుకెళ్లిన రైలు.. నలుగురు మృతి!

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ టీమ్ లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. బావిలో పడిపోయిన వ్యాన్ లోంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసేందుకు స్థానికుల సహాయంతో తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక వాహనంలో సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×