E-Paper
Advertisement

KTR Frustration : సహనం కోల్పోయిన కేటీఆర్.. ఓటమి భయంతోనే అలా మాట్లాడారా ?

KTR Frustration : సహనం కోల్పోయిన కేటీఆర్.. ఓటమి భయంతోనే అలా మాట్లాడారా ?
Advertisement

KTR Frustration : తెలంగాణలో హస్తం గాలి వీస్తోంది. సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలంతా గెలుపు ధీమాతో ఫుల్‌ జోష్‌లో ఉండటంతో గులాబీ నేతలు ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఇచ్చిన హామీలను నిలదీస్తుంటే ఏం చెప్పాలో తెలియని అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతూ నోరు జారుతున్నారు. అందుకు నిదర్శనం వలిగొండలో యువకులపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలే.

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన మంత్రి కేటీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో యువకులను సన్నాసులంటూ దుర్భాషలాడారు. ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న ఆయనను.. అక్కడి స్థానిక యువకులు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేజీ టూ పీజీ విద్య ఏమైందని.. డిగ్రీ కాలేజ్‌ మాట సంగతేంటని..? ఇంటికో ఉద్యేగం ముచ్చటేమైందని నిలదీశారు. దీంతో సూటిగా సమాధానం చెప్పలేని కేటీఆర్‌లో మాట తప్పామన్న అసహనంతో ఫ్రస్టేషన్‌ తన్నుకొచ్చింది. అందరిలో నిలదీసేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. ఆ యువకులను సన్నాసులంటూ మండిపడ్డారు. దుర్భాషలాడారు. కూల్‌గా ఉండే కేటీఆర్‌లో ఓటమి గుబులు, అసంతృప్తి మొదలైందని ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఇక కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నారు. ఈసారి కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమని.. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయం గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని.. ఆ ఫ్రస్టేషన్‌తోనే టంగ్‌ స్లిప్‌ అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

.

.

Advertisement

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

Big Stories

Advertisement
×