Kalyana Lakshmi: మాజీ సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం కళ్యాణలక్ష్మి పథకం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళ్యాణలక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ ఎక్స్ లో కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఉద్యమ సమయంలో గిరిజన తండాలో స్వయంగా చూసిన ఘటనకు ప్రేరణగా ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. తెలంగాణలోని లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయంలో కేసీఆర్ మేనమామ లాగా నిలిచారన్నారు. పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారారని ప్రశశించారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్‌కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడిందని గుర్తుచేశారు. బాల్య వివాహాలను కూడా తగ్గించిందన్నారు. గత పన్నెండేళ్లలో కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు.
Also Read: నైట్‌క్లబ్‌లో దారుణం.. మహిళ దుస్తులు ఊడదీసి విచక్షణారహిత దాడి.. వీడియోలు వైరల్!
అయితే కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇస్తామన్న తులం బంగారం హామీ దేవుడెరుగు.. అసలు కళ్యాణలక్ష్మీ పథకమే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్నదన్నారు. కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి ఈ రోజుతో 12 ఏళ్లు నిండిన శుభ సమయాన లబ్ధిదారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: ‘విమానమే నా బిడ్డ ప్రపంచం.. భార్య కూడా అదే’.. కెప్టెన్ స్మిత్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు