E-Paper
Advertisement

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

KTR Hotels Row: కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి మొదలెట్టిన పొలిటికల్‌ గేమ్ కొత్త మలుపులు తిరుగుతోంది. కేటీఆర్‌ అడ్డా సిరిసిల్లలో ముఖ్యమంత్రి బహిరంగ సభ తర్వాత ఈ గేమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. కేటీఆర్ అండ్‌ ఫ్యామిలీ 8 వేల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసిందని అసెంబ్లీలో చెప్పిన రేవంత్.. సిరిసిల్లలో పార్ట్ -2 చూపించారు. కేటీఆర్‌కు హైటైక్ సిటీ దగ్గర మూడు స్టార్ హోటళ్లు ఉన్నాయని బాంబ్ పేల్చారు. ఒకప్పుడు ఆంధ్రా వాళ్ల పేరుతో ఉన్న ఆ హోటళ్లు కేటీఆర్ పేరు మీదకు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. సిరిసిల్ల వస్తే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తన పేరిట ఏయే ఆస్తులున్నాయో శ్వేతప్రతం ఇవ్వాలని రివర్స్ అటాక్ చేశారు ముఖ్యమంత్రి.

కేటీఆర్ వెంటపడిన కాంగ్రెస్ కేడర్..

Advertisement

సీఎం ఇలా అన్నారో లేదో కాంగ్రెస్ కేడర్ అంతా కేటీఆర్ వెంటపడింది. అమెరికాలో 20 ఏళ్లు పని చేస్తే హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కొనలేకపోతున్నారని… అలాంటిది ఐదేళ్లు పని చేస్తేనే హోటళ్లు కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తోంది. తనకు హోటళ్లు ఉన్న సంగతి కొత్తదేం కాదని.. 2009 ఎన్నికల అఫిడవిట్లోనే పెట్టానని క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు కేటీఆర్. అయితే ఆ అఫిడవిట్‌లో ఆ వివరాలెక్కడా లేవని, ఇవిగో ఆధారాలంటూ బయటపెట్టారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాళేశ్వరం, ఫార్ములా-ఈ రేస్‌ డబ్బులతోనే హోటళ్లు కొన్నారని కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ చామల. ఇలా ప్రస్తుతం హోటళ్లు, ఆస్తుల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది.

Also Read: ఢిల్లీ దద్దరిల్లింది.. ముంబై హోరెత్తింది.. సర్‌ వివాదంలో జెన్ జీ 2.O అటాక్!

Tags

Related News

తెలంగాణలో క్రీడా విప్లవం.. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సర్కార్ ప్లాన్!

గాంధీ జయంతి వేళ KCR సంచలన కామెంట్స్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్!

మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!

కేసీఆర్‌ని తిట్టడం కాదు.. పాలనసై దృష్టి పెట్టు రేవంత్!- చింత ప్రభాకర్

దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై దాడి.. నిందితుడు అదుపులోకి!

Big Stories

Advertisement
×