Putin NATO Warning: ఫ్లై దుబాయి విమానాన్ని హైజాక్‌చేసే ప్రయత్నం నిజమేనా? టెర్రర్ కుట్ర వుందా? అనే అనుమానాలకు ఇంకా తెరపడలేదు.కానీ కాక్‌పిట్ లో గొడవ..పైలట్ పై దాడి వెనుక ఇరాన్ ప్రమేయం వుందంటూ అనుమానాలకు మరింత ఆజ్యం పోశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ పాయింట్‌పై దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రమేయం ఉందని తేలితే ఇక ఇరాన్‌పై దాడులు మాములుగా వుండవని వార్నింగ్ ఇచ్చారాయన . ఇరాన్ న్యూక్లియర్ సత్తాను జీరోచేయడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
పుతిన్ సంచలన ప్రకటన..
లేటెస్ట్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ .. నాటో దేశాలను టార్గెట్ చేస్తూ సంచలన ప్రకటన చేశారు. అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించడమే రష్యా అభిమతమన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఉక్రెయిన్ కు ఊతమిస్తూ రష్యా భూభాగంపై అటాక్ చేయాలని చూస్తే ఎవర్నీ ఊపేక్షించమన్నారు. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్నారు. రష్యాపై ఉక్రెయిన్ దాడులకు సహకరించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు పుతిన్.
నాటోను చిత్తు చేసే సత్తా రష్యాకు ఉంది..
నాటో కన్నా రష్యా సైనిక సత్తా రెండింతలు పెద్దదనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు పుతిన్ . ఫ్రాన్స్, బ్రిటన్ అణు సామర్ధ్యం ఏంటో తమకు అంచాన వుందన్నారు. ఐనా సరే నాటోను చిత్తు చేసే సత్తా రష్యాకు ఉందన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్ యుద్ధమని ఆరోపించారాయన.
టచ్ మీ నాట్ అన్నట్టుగా నాటోకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన పుతిన్..
భారత్‌పై, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. యుద్ధాన్ని ఆపాలని తమపై ఒత్తిడి తేవడంలో భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. శాంతియుత పరిష్కారాల కోసం మోదీ ఎన్నో మంచి సలహాలు ,సూచనలు ఇస్తుంటారన్నారు. రష్యాతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ విషయంలో మాత్రం భారత తటస్థ వైఖరి కొనసాగిస్తుందన్నారు. యుద్ధం వల్ల మరింత అనర్ధం జరగకుండా నివారించేందుకు మోదీ చూపిస్తోన్న చొరవను అభినందించారు పుతిన్. భారత్ శాంతి ప్రతిపాదనలను తాము స్వాగతిస్తామన్నాయి క్రెమ్లిన్ వర్గాలు.
Also Read: ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!