Rollme AirCam: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ ‘రోల్‌మీ’ మార్కెట్లోకి సరికొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా మనం స్మార్ట్ గ్లాసెస్ రూపంలో కెమెరా డివైజ్‌లను చూస్తుంటాం. కానీ, దానికి భిన్నంగా ఓపెన్-ఇయర్ హెడ్‌ఫోన్స్, కెమెరా, ఏఐ ఫీచర్ల కలయికతో Rollme AirCam అనే సరికొత్త హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. చేతులతో పట్టుకునే పనిలేకుండా, సులువుగా రికార్డ్ చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ఎయిర్‌క్యామ్‌లో 8MP సోనీ సైడ్-మౌంటెడ్ కెమెరాను అమర్చారు. దీని ద్వారా 1080 పిక్సెల్స్ సామర్థ్యంతో సెకనుకు 30 ఫ్రేమ్స్ వేగంతో వీడియోలను షూట్ చేయవచ్చు. సైక్లింగ్, హైకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు ప్రయాణాన్ని రికార్డ్ చేయడానికి ఇది చక్కగా సరిపోతుంది. అలాగే దీనిలో ఉన్న ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) వల్ల వీడియోలు అస్సలు ఊగకుండా, చాలా సాఫీగా వస్తాయి.
ఈ డివైజ్‌ను కంట్రోల్ చేయడం చాలా సులభం. దీనిపై ఉండే టచ్ ఇంటర్‌ఫేస్ ద్వారా కేవలం ఒక్క ట్యాప్‌తో ఫోటోలు తీసుకోవచ్చు. రెండు సార్లు ట్యాప్ చేస్తే వీడియో రికార్డింగ్ ఆన్ అవుతుంది. మూడు సార్లు ట్యాప్ చేస్తే ఆడియో రికార్డింగ్ మొదలవుతుంది. ఇందులో 8GB స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ఇందులో రికార్డ్ అయిన డేటాను వైఫై 6 ద్వారా వేరే డివైజ్‌లలోకి మార్చుకోవచ్చు. అయితే, నిరంతర వీడియో రికార్డింగ్ సమయం మాత్రం కేవలం 10 నిమిషాలకే పరిమితం చేశారు.
Also Read: Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!
పాటలు వినేందుకు దీనిలో 16mm డైనమిక్ డ్రైవర్లను అందించారు. ఇది ఓపెన్-ఇయర్ డిజైన్ కావడం వల్ల చెవుల లోపలికి వెళ్లదు. ఫలితంగా మనం పాటలు వింటున్నప్పుడు కూడా చుట్టుపక్కల వచ్చే ట్రాఫిక్ శబ్దాలు, మనుషుల మాటలు స్పష్టంగా వినబడతాయి. రోడ్లపై వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కాల్స్ మాట్లాడుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు రాకుండా ఉండేందుకు ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి.
ఈ హెడ్‌సెట్ కేవలం రికార్డింగ్‌కే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పనిచేస్తుంది. దీని సాయంతో రియల్ టైమ్ వాయిస్ ట్రాన్స్‌లేషన్ (భాషాంతరం) చేసుకోవచ్చు. మన కళ్లముందు ఉన్న వస్తువులు, బోర్డులపై ఉన్న టెక్స్ట్ లేదా పర్యాటక ప్రాంతాలను గుర్తుపట్టి, వాటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ కెమెరా మనకు అందిస్తుంది. ఇందులో 220mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల పాటు నిరంతరంగా పాటలు వినడానికి లేదా మాట్లాడుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.
రోల్‌మీ ఎయిర్‌క్యామ్ ధరను కంపెనీ రూ.6,700గా నిర్ణయించింది. దీనిని రోల్‌మీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది క్లాసిక్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్, పెర్ల్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. అడ్వెంచర్ ఇష్టపడేవారికి ఈ సరికొత్త గ్యాడ్జెట్ మంచి ఎంపిక కానుంది.
Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన iPhone Air.. అసలు కారణం ఇదేనా?