E-Paper
Advertisement

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
Advertisement

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గురుదక్షిణ కోసమే ఏపీకి తెలంగాణ జలాలు ధారాదత్తం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. నిజంగా అన్నం తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలు తరలిస్తున్నప్పుడు హరీష్‌రావు గాడిదలు కాస్తున్నాడా అని, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది నువ్వే కదా అంటూ నిలదీశారు.

Advertisement

ఇదే సమయంలో తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయన్న సీఎం.. అందులో మొదటిది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌లతో కూడిన ‘కిలాడీ కమిటీ’ అని, రెండోది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘NDSA కమిటీ’ అని పేర్కొన్నారు. కిలాడీ కమిటీ చేసే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు, ఒత్తిళ్లకు తాము లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిపుణులతో కూడిన కేంద్ర ప్రభుత్వ సంస్థ NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏది చెబితే తాము దాన్నే తూచా తప్పకుండా పాటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×