BigTV English

KTR Call: మహిళా కార్యకర్తకు కేటీఆర్ ఫోన్? పార్టీని వీడొద్దు.. న్యాయం చేస్తానంటూ

KTR Call: మహిళా కార్యకర్తకు కేటీఆర్ ఫోన్? పార్టీని వీడొద్దు.. న్యాయం చేస్తానంటూ

KTR Phone: బీఆర్ఎస్‌ నుంచి కార్యకర్తలు డ్రాపవుతున్నారా? ఆశాప్రియ వ్యవహారం పార్టీలో దుమారం రేగుతోందా? ఆమె బాటలో మరికొందరు నడవాలని ప్లాన్ చేస్తున్నారా? పరిస్థితి గమనించి కేటీఆర్ రంగంలోకి దిగారా? ఇంతకీ ఆశాప్రియ తల్లితో కేటీఆర్ ఏం మాట్లాడారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఆశాప్రియ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె దారిలో మరికొందరు కార్యకర్తలు నడవాలని ఆలోచన చేస్తున్నారట. చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఏం చెయ్యాలో పార్టీ అధిష్టానానికి అంతుబట్టడం లేదట. ఏం చేయాలంటూ లోలోపల మథనపడుతున్నారట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేడర్ కాపాడుకోకుంటే పార్టీ మనుగడ కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది. మా ఒత్తిడి వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, కార్యకర్తలు వేడుకలు చేసుకోవాలని బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి సంకేతాలు వెళ్లాయి. నేతలు మాట ఏమోగానీ, కనీసం ఏ ఒక్క కార్యకర్త బయటకు రాలేదని అంతర్గత సమాచారం.


దీంతో అలర్టయిన బీఆర్ఎస్ హైకమాండ్, అందుకు సంబంధించి కారణాలను అన్వేషించే పనిలో పడిందట. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ఆశాప్రియ, ఆమె తల్లి లలితమ్మకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

ALSO READ: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్, తప్పిన ముప్పు..

పార్టీ పని ఒత్తిడి వల్ల ఆశాప్రియ రాజీనామాపై స్పందించలేకపోయానని, చెల్లికి న్యాయం చేస్తానని, పార్టీని ఎట్టిపరిస్థితుల్లో వీడొద్దని సూచన చేశారట. ఇప్పటికే ముదిరాజ్ వర్గం దూరంగా ఉందని, పార్టీని ఈ విధంగా బాధ పెట్టడం మంచిది కాదని అన్నారట.

ఆశా ప్రియకు తోడుగా ఉంటానని, మక్తల్‌కి వచ్చినపుడు తాను కలుస్తానంటూ అభయమిచ్చారట యువనేత. అంతేకాదు ఆశా ప్రియకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, ఐటీ జాబ్‌కు వెళ్లవద్దని హితవు పలికారట. మన ప్రభుత్వం రాగానే జాబ్ ఇప్పిస్తాననే హామీ ఇచ్చారట యువనేత.

కేటీఆర్ చెప్పింది విని.. ఆశాప్రియ, ఆమె తల్లి సైలెంట్ అయ్యారట. వారి నుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నది గులాబీ పార్టీ వర్గాల మాట. బీఆర్ఎస్ పార్టీలో ఆశాప్రియా అంటే తెలియని నేత ఉండరు. పార్టీపై మంచి పట్టున్న మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారామె. అలాంటి కార్యకర్త పార్టీకి రాజీనామా చేయడంతో మిగతా కార్యకర్తలు ఆలోచన పడినట్టు సమాచారం.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×