E-Paper
Advertisement

KTR: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనక కథేంటి ?

KTR: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనక కథేంటి ?
Advertisement

KTR: కేటీఆర్ టెన్షన్ పడుతున్నారా? ఫార్ములా ఈ కేసు విచారణను తప్పించుకు నేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకోవైపు పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? పార్టీలో జరుగుతున్న లుకలుకలపై ఇంటాబయటా చర్చ తీవ్రమయ్యిందా? ఓ వైపు కవిత, మరోవైపు కేటీఆర్ కాబోయే సీఎం అనే ప్రచారానికి బ్రేక్ వేసేందుకు ట్రై చేస్తుందా? వాటిని డైవర్ట్ చేసే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య డైవర్ట్ పాలిటిక్స్. మీడియా అడిగే ప్రశ్నలకు తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లడం కామన్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు నమోదుతో కేటీఆర్ ఇమేజ్ అమాంతంగా పడిపోయిందన్నది నేతల మాట. విచారణకు హాజరై మరింత దారుణంగా ఉంటుందని గమనించారాయన. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

ఫార్ములా కేసులో తొలిసారి ఏసీబీ ముందు విచారణకు హారవుతున్నారు కేటీఆర్. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణకు వెళ్లకుంటే దాన్ని షాకుగా చూపించి న్యాయస్థానంలో బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు హాజరవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు పార్టీ నుంచి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

ఇదిలావుండగా శనివారం మీడియా ముందుకొచ్చిన కేటీఆర్.. మనసులో ఏ ముందో చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేవారు. ఆ తర్వాత వివిధ ఛానెళ్లతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై మీడియా ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పనికిమాలిన వారు ఇలాంటి స్లోగన్స్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పని చేస్తున్నామన్నారు. చివరి వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పకనే చెప్పేశారు. కేసీఆర్ మీ నాయకుడు అన్నప్పుడు.. అసెంబ్లీకి ఎప్పుడు వస్తున్నారు అనే ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేదు.

Advertisement

ALSO READ: ఐఐటి ఇందోర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. ఆ వ్యసనంతోనే?

బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్నది వాదన మరింత బలపడింది. ఈ మధ్యకాలం లో కేటీఆర్ మాటలు సరిగా లేవన్నది కొందరి మాట.  ఒకప్పుడు హుందాగా ప్రవర్తించే వారని, ఇప్పుడదేమీ కనిపించలేదని అంటున్నారు. గతంలో పొరుగు రాష్ట్రం ఏపీలో వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడేవారని, దాన్ని ఫాలో అవుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×