E-Paper
Advertisement

KTR On IndiGo Issue: ఎయిర్ పోర్టులు బస్ స్టాండ్లలా మారాయి.. ఇండిగో సంక్షోభంపై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

KTR On IndiGo Issue: ఎయిర్ పోర్టులు బస్ స్టాండ్లలా మారాయి.. ఇండిగో సంక్షోభంపై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్
Advertisement

KTR On IndiGo Issue: కొంత మంది చేతులో అధికారం ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో ఇండిగో సంక్షోభం బెస్ట్ ఉదాహరణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతదేశ విమానయానం మొత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా ఇద్దరి చేతిలోనే ఉండిపోయిందన్నారు. గత 5 రోజుల నుంచి ఎయిర్‌పోర్ట్‌లన్నీ రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారిపోయాయి. కొంతమంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతం అయితే జరిగే దుష్పరిణామాలకు ఇది గొప్ప ఉదాహరణ అన్నారు.

ఎయిర్ పోర్టులు రైల్వే స్టేషన్ల తరహాలో

శ్రమ దోపిడీ చేయొద్దు, పైలట్ వారానికి ఇంత సమయం మాత్రమే పనిచేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంవత్సరం కింద ఒక రూల్ తెచ్చిందని కేటీఆర్ తెలిపారు. సంవత్సరం కింద శ్రమ దోపిడీ చేయొద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదన్నారు. దీంతో నిన్న ఒక్క రోజే ఇండిగో సంస్థకు చెందిన 1000 విమానాలు రద్దు అయ్యాయని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లు అన్ని జనంతో కిటకిటలాడుతున్నాయని, అధ్వానంగా మారాయన్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా దెబ్బకు కేంద్ర మంత్రిత్వ శాఖ పెట్టిన రూల్ ను వాళ్లే వెనక్కి తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు.

శ్రమ దోపిడీ అలవాటు

Advertisement

“పవర్ అంతా ఒకరిద్దరి చేతుల్లో కేంద్రీకృతమై ఇండిగో లాంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది. భారత విమానయాన రంగంలో ఇండిగో సంక్షోభం ఇందుకు మంచి ఉదాహరణ. గత ఐదు రోజులుగా ఎయిర్ పోర్టులు రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానంగా మారాయి. ఎక్కడిక్కడ ప్రయాణికులు తన్నుకుంటున్నారు. ఇండిగో సంస్థ వెయ్యికి పైగా విమానాలు బంద్ పెట్టింది. ఎందుకంటే ఏడాది క్రితం సివిల్ ఏవీయేషన్ మినిస్ట్రీ ఒక రూల్ పాస్ చేసింది.

శ్రమ దోపిడీ చేయవద్దు. వారానికి ఒక పైలట్ ఇంత సమయం మాత్రమే నడపాలి అని రూల్ పాస్ చేసింది. ఇండిగో, ఎయిరిండియా ఈ రెండు సంస్థలే దేశ విమానయాన రంగాన్ని చేతుల్లో పెట్టుకున్నాయి. సంవత్సరం కిందట కేంద్రం చెప్పిన శ్రమ దోపిడీ అలవాటు పడిన ఇండిగో సంస్థ.. కొత్త పైలట్స్ ను తీసుకోలేదు. దీంతో నిన్న ఒక్క రోజే 1000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. మొత్తం వ్యవస్థ అంతా కొంత మంది చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందో ఇండిగో మంచి ఉదాహరణ.

Advertisement

Also Read: IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్

దేశ విమానరంగం టాటా, ఇండిగో ఈ ఇద్దరి చేతుల్లోకి పోయింది. వాళ్లు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ల ఇచ్చిన ఆర్డర్ వాళ్లే వెనక్కి తీసుకున్నారు. ఇండిగో వాడు వెనక్కి తగ్గలేదు. నేను తప్పు చేసినా అని ఒప్పుకోవడంలేదు. వాడికి ఫైన్ వేసే దమ్ము కేంద్రానికి లేదు. చివరికి కేంద్రమే దిగివచ్చి, మరికొంత సమయం ఇస్తామని ఎయిర్ లైన్స్ కు చెప్పింది. శక్తి, సంపద మొత్తం ఒకరిద్దరి చేతుల్లో పెడితే ఏం అవుతుందో ఇండిగో సంక్షోభం మంచి ఉదాహరణ” -అని కేటీఆర్ అన్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×