KTR Son Himanshu: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్నామని ఆ పార్టీ నేతలు పదే పదే ఊదరగొడతారు. మా పాలన దేశానికి ఆదర్శమని, రాష్ట్రానికి స్వర్ణయుగమని సమయం దొరికినప్పుడల్లా నేతలు చెప్పారు.. ఇప్పటికీ కూడా.
కేసీఆర్ ఆనాటి పాలనపై మనవడు హిమాన్ష్ తనదైన శైలిలో చెప్పాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేవో స్వయంగా విడమరిచి చెప్పాడు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబిత ఆధ్వర్యంలో కేసీఆర్ మనవడు హిమాన్ష్ ఓ స్కూల్‌ను సందర్శించాడు.
స్కూల్ చూసి కళ్లంట నీళ్లు వచ్చాయన్నారు. కనీసం మౌళిక సదుపాయాలు లేకపోతే ఎలా? చిన్న బాధ వేసిందన్నాడు. హెచ్ మాస్టార్ రూమ్ చూసి షాకయ్యానని, మాటల్లో చెప్పలేనని అన్నారు. అదే విషయాన్ని మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. హిమాన్ష్ మాటల వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడిది నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేవో స్వయంగా
కేసీఆర్ మనవడు…,
కేటీఆర్ తనయుడే… చెప్పాడు
— మంత్రి సీతక్క#TelanganaAssembly
• @meeseethakka pic.twitter.com/2zudjLwnv5— Congress for Telangana (@Congress4TS) December 21, 2024